Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం.. మే 31 వరకు లాక్డౌన్ పొడగింపు

Advertiesment
మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం.. మే 31 వరకు లాక్డౌన్ పొడగింపు
, శుక్రవారం, 15 మే 2020 (15:08 IST)
మహారాష్ట్ర సర్కారు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. గత 50 రోజులుగా లాక్డౌన్ అమల్లో వున్నప్పటికీ.. ఈ నెలాఖరు వరకు దీన్ని పొడగించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం కరోనా వైరస్సే. ఈ వైరస్ మహారాష్ట్రను కుదిపేస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేక మహారాష్ట్ర వైద్యాధికారులు చేతులెత్తేశారు. ఫలితంగా దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో ఏకంగా 25 శాతం కేసులు ఈ ఒక్క రాష్ట్రంలోనే నమోదుకావడం గమనార్హం. 
 
ఈ నేపథ్యంలో లాక్డౌన్‌ను మే 31 వరకు పొడిగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న ముంబై, పుణె, మాలేగావ్‌, ఔరంగాబాద్‌, షోలాపూర్‌ వంటి కరోనా వైరస్‌ హాట్‌స్పాట్‌లలో లాక్‌డౌన్‌ను పొడిగించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వంలోని మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నది. దేశంలో నాలుగో విడత లాక్‌డౌన్‌ ఉంటుందన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు ముందుగానే లాక్డౌన్‌పై నిర్ణయం తీసుకుంది. 
 
మరోవైపు, రాజస్థాన్ రాష్ట్రంలో కూడా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారానికి కొత్త మరో 55 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,589కి చేరింది. రాజస్థాన్‌ ఆరోగ్య శాఖ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు. మొత్తం కేసులలో 2,646 మంది వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, మరో 125 మంది మృతిచెందారని వారు తెలిపారు. ప్రస్తుతం 1,818 మంది రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనావైరస్: కోవిడ్‌తో పోరాడే ఔషధాన్ని తయారు చేయనున్న భారత్, పాకిస్తాన్‌