Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా క్రైసిస్ : మహారాష్ట్రలో లాక్డౌన్ పొడగింపు...

Advertiesment
కరోనా క్రైసిస్ : మహారాష్ట్రలో లాక్డౌన్ పొడగింపు...
, ఆదివారం, 17 మే 2020 (15:26 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తికి ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నా కొత్త కేసుల నమోదు మాత్రం ఆగలేదు. దీంతో ప్రస్తుతం అమలు చేస్తున్న లాక్డౌన్‌ను ఈ నెల 31వ తేదీ అర్థరాత్రి వరకు పొడగిస్తూ మహారాష్ట్ర సర్కారు పొడగించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజోయ్ మెహతా ఉత్తర్వులు జారీచేశారు. 
 
1897 నాటి అంటు వ్యాధుల చ‌ట్టంలోని సెక్ష‌న్ 2తోపాటు, 2005 నాటి విప‌త్తు నిర్వ‌హ‌ణ చ‌ట్టం ప్ర‌కారం లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. మూడో విడ‌త లాక్‌డౌన్ గ‌డువు మే 17వ తేదీతో ముగియనుంది. ఈ నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యం తీసుకుంది. 
 
మే 31న అర్థరాత్రి వ‌ర‌కు నాలుగో విడ‌త లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. కాగా, మ‌హారాష్ట్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు 30,706 కేసులు న‌మోద‌య్యాయ‌ని, వారిలో 1135 మంది మ‌ర‌ణించ‌గా 7,088 మంది వైర‌స్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యార‌ని మ‌హారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. 
 
అలాగే, తమిళనాడు రాష్ట్రంలో కూడా ఈ లాక్డౌన్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం పొడగించింది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 10585 కేసులు నమోదు కాగా, 74 మంది చనిపోయారు. ముఖ్యంగా, ఆ రాష్ట్ర రాజధాని చెన్నోలో ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో లాక్డౌన్‌ను మే నెలాఖరు వరకు పొడగించింది. 
 
ఇదిలావుంటే, రాజస్థాన్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 91 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,838కి పెరిగింది. ఇందులో 1,941 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ ప్రాణాంతక వైరస్‌తో రాష్ట్రంలో ఇప్పటివరకు 125 మంది మరణించారని ఆరోగ్యశాఖ ప్రకటించింది. 
 
కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో జైపూర్‌లో 55, దుంగార్పూర్‌లో 21, ఉదయ్‌పూర్‌లో 9 చొప్పున ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 85940 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 2752 మంది మరణించారు. గత 24 గంటల్లో 3970 కేసులు కొత్తగా నమోదయ్యాయి. 
 
అలాగే, కర్నాటక రాష్ట్రంలోనూ కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఆదివారం కొత్త‌గా 54 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 1146కు చేరింది. క‌ర్ణాట‌క ఆరోగ్య శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. అయితే, మొత్తం కేసుల‌లో 37 మంది మ‌ర‌ణించ‌గా 497 మంది వైర‌స్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యార‌ని, మిగ‌తా 611 యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని అరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాస్కులు - పీపీఈ కిట్లు ఇవ్వలేదన్న వైద్యుడిపై కేసు - పిచ్చాసుపత్రికి తరలింపు!!