Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాధువులను ఆలయంలోనే హత్య చేశారు.. ఇంతకీ వాళ్లేం చేశారు..?

ఉత్తరప్రదేశ్‌లో సాధువులు దారుణ హత్యకు గురయ్యారు. కాగా, గత కొంతకాలంగా ఔరైయాలో గోవధ జరుగుతోంది. దీనిని వ్యతిరేకించడం వల్లే సాధువులను హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (11:07 IST)
ఉత్తరప్రదేశ్‌లో సాధువులు దారుణ హత్యకు గురయ్యారు. కాగా, గత కొంతకాలంగా ఔరైయాలో గోవధ జరుగుతోంది. దీనిని వ్యతిరేకించడం వల్లే సాధువులను హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. యూపీలోని ఔరైయా జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు నిద్రిస్తున్న ముగ్గురు సాధువులను మంచానికి కట్టివేసి విచక్షణ రహితంగా కొట్టారు. ఆపై కత్తితో పొడిచి మెడను కోశారు. ఈ ఘటలో ఇద్దరు సాధువులు ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన సాధువును వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 
 
ఆలయంలోని సాధువులు హత్యకు గురయ్యారన్న వార్త వెలుగులోకి రావడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు ఆందోళన చేపట్టారు.  పరిస్థితిని చక్కదిద్దేందుకు వచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో అదనపు పోలీసు బలగాలను దింపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments