శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం...
ఒక వైపున ఆధ్యాత్మిక సంపద, మరోవైపున చారిత్రక వైభవం కలిగిన క్షేత్రాలు విశిష్టమైనవిగా వెలుగొందుతూ ఉంటాయి. అలాంటి ఆధ్యాత్మిక చారిత్రక నేపథ్యం కలిగిన పుణ్యక్షేత్రంగా కడప జిల్లాలో దర్శనమిస్తుంటారు ఆంజనేయస్వ
ఒక వైపున ఆధ్యాత్మిక సంపద, మరోవైపున చారిత్రక వైభవం కలిగిన క్షేత్రాలు విశిష్టమైనవిగా వెలుగందుతూ ఉంటాయి. అలాంటి ఆధ్యాత్మిక చారిత్రక నేపథ్యం కలిగిన పుణ్యక్షేత్రంగా కడప జిల్లాలో దర్శనమిస్తుంటారు ఆంజనేయస్వామివారు. కడప జిల్లాలోని ఈ దివ్యక్షేత్రం భక్తుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తుంది. దేవాలయ నిర్మాణం కోసం కేటాయించిన స్థలాలు గతవైభవానికి నిదర్శనమై నిలుస్తుంటాయి.
పూర్వం ఇక్కడ హనుమంతుని ఆలయం మాత్రమే ఉండేది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఇక్కడ ఆవిర్భవించిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. పవిత్రమైన ఈ ప్రదేశంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కూడా ఉంటే బాగుంటుందని భావించిన ఓ భక్తుడు, ఆ స్వామి గురించి అదే పనిగా ధ్యానం చేసేవాడు. ఆ భక్తుని విన్నపం మేరకు లక్ష్మీ సమేతుడై స్వామి ఇక్కడికి ఆవిర్భవించారు.
ఆనాటి నుండి లక్ష్మీ వేంకటేశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయ నిర్మాణానికి ముఖ్య పాత్రను పోషించారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. గర్భాలయంలో స్వామివారు దివ్యమైన తేజస్సును వెదజల్లుతూ ఉండగా, పద్మావతి అమ్మవారు గోదాదేవి ప్రత్యేక మందిరాలలో దర్శనమిస్తుంటారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి సైన్యాధిపతి అయిన విష్వక్సేనుల వారు కూడా ఈ ఆలయ పూజలను అందుకుంటుంటారు. తిరుమల బాలాజీకి అనుకున్న మెుక్కులను, వీలునుబట్టి ఈ క్షేత్రంలో చెల్లించుకుంటారు. అంతేకాకుండా ఇక్కడి లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని దర్శించడం వలన దారిద్య్రం, దుఃఖం నశించి, సిరిసంపదలు, సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.