శనివారం (04-08-18) దినఫలాలు - ఊహించని సంఘటనలు వల్ల...
మేషం: రాజకీయనాయకులు సభా, సమావేశాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక విషయాలలో ఏకాగ్రత వహించలేరు. స్త్రీలకు పొట్ట, బి.పి., నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. ఊహించని సంఘటనలు వలన మనస్థాపం తప్పవు. బ్యాంకిం
మేషం: రాజకీయనాయకులు సభా, సమావేశాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక విషయాలలో ఏకాగ్రత వహించలేరు. స్త్రీలకు పొట్ట, బి.పి., నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. ఊహించని సంఘటనలు వలన మనస్థాపం తప్పవు. బ్యాంకింగ్ వ్యవహారాలు, మధ్యవర్తిత్వాలకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రతముఖ్యం.
వృషభం: ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు రుణంలో కొంత మెుత్తం తీర్చగలుగుతారు. విద్యార్థులు బహుమతులు, ప్రసంసలు అందుకుంటారు. ఉపాధ్యాయుల శ్రమకు తగిన గుర్తింపు, ప్రసంశలు లభిస్తాయి. ఉద్యోగ విషయాల దృష్ట్యా తరుచూ ప్రయాణాలు చేయవలసివస్తుంది. నూతన వ్యక్తులు సన్నిహితులవుతారు.
మిధునం:మీ మిత్రులకోసం, బంధువుల కోసం బరువు భాద్యతలు స్వీకరిస్తారు. మీ లక్ష్యసాధనకు నిరంతర కృషి, పట్టుదల చాలా అవసరం. సైన్స్, గణిత రంగాలలోని వారికి గణనీయమైన పురోభివృద్ధి. కోర్టు వ్యవహారాలు ప్రగతి పథంలో నడుస్తాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలవారికి సామాన్యంగా ఉంటుంది.
కర్కాటకం: సన్నిహితులతో మీ ఆర్ధిక విషయాలను గురించి చర్చించవద్దు. రిప్రజెంటేటివ్లకు పురోభివృద్ధి. బంగారు, వెండి, వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితం. అప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాలవారికి సదవకాశాలు లభిస్తాయి. బంధువుల రాకపోకలు పెరుగుతాయి.
సింహం: ఆర్ధిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ప్రలోభాలకు లొంగవద్దు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. రుణాల కోసం అన్వేషిస్తారు. ఉద్యోగస్తులు పై అధికారుల మెప్పును పొందుతారు. విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు విలువైన వస్తువులు కొనుగోలుకే చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
కన్య: ప్లీడరు, ప్లీడరు గుమస్తాలకు పురోభివృద్ధి కానవస్తుదం. విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్లలో విజయం సాధిస్తారు. ప్రాప్తించబోయే ధనానికి ముందుగానే ఖర్చులు ఎదురవుతాయి. స్త్రీలు విదేశీయ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. పత్రిక, ప్రైవేటు విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం పెరుగుతుంది.
తుల: ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగానే ఉంటాయి. వాహనం నిదానంగా నడపండి. స్త్రీలు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా సమయానికి పూర్తికాగలవు. పారిశ్రామికవేత్తలకు, కళ, సాంకేతిక రంగాలవారికి ప్రోత్సాహకరం. అందరితో వీలైనంత క్లుప్తంగా మాట్లాడండి.
వృశ్చికం: వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ, ఏకాగ్రత అవసరం. ఆర్ధిక లావాదేవీలు సమర్ధంగా నిర్వహిస్తారు. స్థిరాచరాస్తుల క్రయవిక్రయాల్లో పునరాలోచన అవసరం. స్త్రీలకు తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఖర్చులు, చెల్లింపులలో ఏకాగ్రత వహించండి.
ధనస్సు: నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ ధ్యేయం నెరవేరుతుంది. మిత్రుల కారణంగా మీ పనులు వాయిదా వేసుకుంటారు. స్త్రీల ఏమరుపాటుతనం, నిర్లక్ష్యం వలన విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది.
మకరం: వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. స్త్రీలకు టీ.వీ ఛానెళ్ల నుండి ఆహ్వానం, పారితోషికం, బహుమతులు అందుతారియ రవాణా రంగాలవారికి చికాకులు అధికమవుతాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగస్తుల సమర్థత, అంకితభావం అధికారులను ఆకట్టుకుంటాయి.
కుంభం: చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తుతాయి. చేపట్టిన పనులు అతికష్టంమ్మీద సమయానికి పూర్తి చేయగలుగుతారు. స్త్రీలకు నరాలు, కళ్ళు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ప్రముఖులను కలుసుకుంటారు. రావలసిన ధనం సకాలంలో అందుతుంది.
మీనం: ప్రైవేటు సంస్థలలోని వారు నిగ్రహంతో వ్యవహరించాలి. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు విజయం సాధిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. సన్నిహితుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి.