Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదివారం (29-07-2018) దినఫలాలు - ఇతరులతో అతిగా మాట్లాడడం...

మేషం: స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందరిని ఆకట్టుకుంటారు. ఆహార విషయాలపై దృష్టి సారించడం అవసరం. షాపింగ్‌లో దుబారా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ధోరణి నెలకొంటుంది. మిమ్మల్ని చూసి అసూయపడే వారు

Advertiesment
Daily Horoscope
, ఆదివారం, 29 జులై 2018 (09:56 IST)
మేషం: స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందరిని ఆకట్టుకుంటారు. ఆహార విషయాలపై దృష్టి సారించడం అవసరం. షాపింగ్‌లో దుబారా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ధోరణి నెలకొంటుంది. మిమ్మల్ని చూసి అసూయపడే వారు అధికం అవుతున్నారని గమనించండి. పాత మిత్రులను కలుసుకుంటారు.
 
వృషభం: గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు వాయిదా పడుతాయి. అసలైన సంతృప్తితో మరిన్ని కొత్త అవకాశాల్ని సొంతం చేసుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడుతాయి. ఉద్యోగస్తులు విధినిర్వహణలో సమర్థత కనబర్చి అధికారుల గుర్తింపు పొందుతారు. 
 
మిధునం: మీకు, బంధువులకు మధ్య తలెత్తిన కలతలన్నీ దూరమై అంతా కలిసిపోతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు. విద్యుత్ రంగాలవారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. చింతపండు, ఎండుమిర్చి, బెల్లం వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసివచ్చును. స్త్రీలు పనివారలతో చికాకులను ఎదుర్కుంటారు. 
 
కర్కాటకం: విదేశాలు వెళ్లటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ట్రాన్స్‌‍పోర్టు, ఆటోమోబైల్ రంగాలలో వారికి అనుకూలమైన కాలం. మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు, రాత పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు.  
 
సింహం: ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. విద్యార్థులు కళ, క్రీడా రంగాలలో చురుకుగా పాల్గొంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోచ్చు.
 
కన్య: కానివేళలో ఇతరుల రాక ఇబ్బది కలిగిస్తుంది. స్త్రీలు కళా రంగాల్లో రాణిస్తారు. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. రవాణా రంగాల వారికి ప్రయాణీకులతో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంటిపాత రుణాలను కొన్నింటిని తీరుస్తారు. 
 
తుల: కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం శ్రేయస్కరం. వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదాపడుట వలన ఆందోళనకు గురౌతారు. బంధువుల రాకతో కొన్ని పనులు వాయిదాపడుతాయి.
 
వృశ్చికం: ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ఏ విషయంలోను ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. భార్యా భర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. అకాలభోజనం, శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వలన అప్పుడప్పుడు అస్వస్థతకు గురవుతారు. 
 
ధనస్సు: మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. స్త్రీలకు కాళ్ళు, నడుము నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. 
 
మకరం: స్త్రీలు చుట్ట ప్రక్కల వారితో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు. మీలో దయాగుణం వికసిస్తుంది. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. పెట్టిపోతలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో ఖచ్చితంగా మెలగాలి. 
 
కుంభం: ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబంలోను, బయటా ఊహించని సమస్యలు తలెత్తుతాయి. అవకాశాలు కలిసిరాక పనులు సాగక విసుగు చెందుతారు. వాతావరణంలోని మార్పు ఆందోళన కలిగిస్తుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. 
 
మీనం: కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. సోదరీసోదరుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి. వీలైనంత మరకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇలా ప్రతి సోమవారం శివుడిని పూజిస్తే... రుణ బాధలు వదిలిపోతాయ్...