మంగళవారం (24-07-18) దినఫలాలు - ప్రేమ వ్యవహారాలు...

మేషం: బంధుమిత్రుల రాకతో నూతన ఉత్సాహం కానవస్తుంది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఐరన్, సిమెంట్, కలప రంగాలలోని వారికి నిరుత్సాహం తప్పదు. ఉద్యోగస్తులకు

మంగళవారం, 24 జులై 2018 (09:07 IST)
మేషం: బంధుమిత్రుల రాకతో నూతన ఉత్సాహం కానవస్తుంది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఐరన్, సిమెంట్, కలప రంగాలలోని వారికి నిరుత్సాహం తప్పదు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
వృషభం: బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఊహించని ఖర్చులు వలన స్వల్ప ఆటుపోట్లు తప్పవు. వాహనయోగం వంటి శుభ ఫలితాలు పొందుతారు. శత్రువులు మిత్రువులుగా మారి సహాయం అందిస్తారు. వైద్యులకు అభివృద్ధి కానరాగలదు. రాజకీయనాయకులకు దూరప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం.
 
మిధునం: స్నేహ సంబంధ బాంధవ్యాలు బలపడుతాయి. కార్మికులకు, పారిశ్రామికులకు పరస్పర అవగాహన కుదురుతుంది. బంధువుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. వ్యాపారం చేయాలనే మీ ఆలోచన అమలులో పెడుతారు.
 
కర్కాటకం: భాగస్వామిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్ధంగా నిర్వహిస్తారు. రాజకీయనాయకలు సభలు సమావేశాలలో పాల్గొంటారు. హోటల్, క్యాటరింగ్ రంగాల్లో వారు పనివారలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఏకాగ్రతతో కృషిచేసిన మీ ఆశయం తప్పక నెరవేరుతుంది. పాత రుణాలు తీరుస్తారు. 
 
సింహం: ఉపాధ్యాయులకు విద్యార్థుల వలన సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ప్రింటింగ్ రంగాలవారికి బాకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. సినీరంగ పరిశ్రమల్లో వారికి చికాకులు, ఒత్తిడి అధికమవుతాయి. 
 
కన్య: కళలు, సాంస్కృతిక రంగాలు, విద్య, న్యాయరంగాల వారి ఈ రోజుకొన్ని అవాంతరాలు ఎదుర్కుంటారు. రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదా పడటం వల్ల ఆందోళనకు గురవుతారు. సోదరులు మీతో అన్ని విషయాల్లోను ఏకీభవిస్తారు. మిమ్మల్ని చీసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
తుల: చిన్నారుల విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయంలో ఖర్చులు అంచనాలు మించుతాయి. కాలక్షేపాల ద్వారా ఊరట పొందుతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి అనుకూలమైన కాలం. మీ అంచనాలు తలక్రిందులయ్యే అవకాశం ఉంది. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. 
 
వృశ్చికం: ఉద్యోగస్థులకు పైఅధికారుల వలన ఒత్తిడి, చికాకులు తప్పవు. పెన్షన్, బీమా సమస్యలు పరిష్కారమవుతాయి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. హోటల్, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. ఇంటి పనులలో నిమగ్నమవుతారు. గృహోపకరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
ధనస్సు: సామూహిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి కనపరుస్తారు. ఉద్యోగస్తులకు ఊహించని అవరోధాలు తలెత్తుతాయి. ఎప్పటినుంచో కలవాలనుకున్న ఆత్మీయులను కలిసే అవకాశం ఉంది. ఉపాధ్యాయ రంగంలోని వారికి అభివృద్ధి కానవస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది.
 
మకరం: వ్యాపారాభివృద్ధికై చేయు ప్రయత్నాలు అనూకలించవు. ముఖ్యల కోసం షాపింగ్‌లు చేస్తారు. దైవస్మరణ వలన మనశ్శాంతి కలుగుతుంది. విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు కలసివస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. 
 
కుంభం: కోర్టు వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి రాగలవు. పదవులు, సభ్యత్వాలకు స్వస్తి చెబుతారు. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు ఆశాజనకం. టెక్నికల్, సాంకేతిక రంగాలలో వారికి లాభదాయకం. ఆలయాలను సందర్శిస్తారు. సోదరిసోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతాయి. 
 
మీనం: కొన్ని విషయాల్లో మిత్రులు మిమ్మల్ని శంకించేందుకు ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. రాజకీయ రంగాలవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కిరాణా రంగంలోని వారికి శుభదాయకం. వ్యాపార విషయాలయందు జాయింట్ సమస్యలు రావచ్చును. ఇతరదేశాలు వెళ్లటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సాలగ్రామాలకు పూజలు ఎలా చేస్తారో తెలుసా?