Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

22-07-2018 - ఆదివారం మీ రాశి ఫలితాలు.. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో?

మేషం: అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. దూరప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. స్త్రీలకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. వ్యవహార ఒప్పందాల్లో తొందరపాటు తగద

22-07-2018 - ఆదివారం మీ రాశి ఫలితాలు.. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో?
, ఆదివారం, 22 జులై 2018 (09:20 IST)
మేషం: అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. దూరప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. స్త్రీలకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. వ్యవహార ఒప్పందాల్లో తొందరపాటు తగదు. బంధువుల ఆకస్మిక రాక వలన ఖర్చులు అధికమవుతాయి.
 
వృషభం: మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాల పై మీ ఆలోచనలుంటాయి. కుటుంబీకుల మెుండివైఖరి అసహానం కలిగిస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూకోసం నిరీక్షణ తప్పదు. సంతానం పై చదువులకు కావలసిన ధనం సర్దుబాటు చేసుకుంటారు. విద్యార్థులు క్రీడా కార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
మిధునం: పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. ఎదుటివారితో ముక్కుసూటిగా సంభాషిస్తారు. కుటుంబీకుల మెుండివైఖరి అసహానం కలిగిస్తుంది. నూతన పెట్టుబడులు లాభిస్తాయి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
కర్కాటకం: మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. సంతానం పై చదువుల కోసం చేసే యత్నం ఫలిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యభంగం, వైద్య సేవలు అవసరం. పెద్దమెుత్తం ధనసహాయం క్షేమం కాదు. కొన్ని సమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతి దూరం చేస్తుంది. 
 
సింహం: ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కుంటారు. కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. పనులు మెుదలెట్టే సమయానికి ఆటంకాలెదురవుతాయి. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది.  
 
కన్య: పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. సంతాం విజయం సంతోషం కలిగిస్తుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది. స్త్రీలకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.
 
తుల: యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖుల కోసం షాపింగ్‌లు చేస్తారు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. వ్యాపారాల్లో నష్టాలను ఎదుర్కుంటారు. 
 
వృశ్చికం: ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. కొన్ని విషయాలను చూసీ చూడనట్టుగా ఉండాలియ సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు.  
 
ధనస్సు: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత, సహనం ఎంతో ముఖ్యం. దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు ఏర్పడుతాయి. మీ చుట్టు ప్రక్కల వారితో సంభాషించేటపుడు జాగ్రత్త అవసరం. సోదరుని వైఖరి చికాకు కలిగిస్తుంది. 
 
మకరం: రేషన్ డీలర్లకు అధికారుల నుండి వేధింపులను ఎదుర్కుంటారు. మీ మంచి తనమే మీకు శ్రీరామ రక్ష. మీ పరోపకార బుద్ధి మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది. స్త్రీలు గృహమునకు కావలసిన వస్తువుల కోసం ధనం ఖర్చుచేస్తారు. రాజకీయాలలోని వారికి ఒక సమాచారం ఎంతో ఆనందాన్నిస్తుంది. 
 
కుంభం: వ్యాపారాల్లో మార్పులు, చేర్పులకు ప్రయత్నిస్తారు. రాజకీయాలలో వారికి విదేశీ పర్యటనలు అధికమవుతాయి. సమయానికి మిత్రులు సహకరించక పోవడంతో అసహానానికి గురవుతారు. ఆత్మీయులను కలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. చేతి వృత్తుల వారికి ఇబ్బందులు తప్పవు.
 
మీనం: ఆర్థిక వ్యవహారాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. మీ సంతానంతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభమవుతాయి. దూరప్రయాణాలు, పుణ్యక్షేత్ర సందర్శనాలకు అనుకూలం. స్త్రీల ఆరోగ్య విషయంలో కొంత మెళకువ వహించండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి తిరునామం ఆయన కనులను సగం వరకూ మూసి వుంచుతుంది... ఎందుకు?