Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంగళవారం (17-07-2018) దినఫలాలు - ఆహార వ్యవహారాల్లో మెళకువ...

మేషం: దంపతుల మధ్య ఏకాగ్రత లోపం అధికమవుతుంది. గతంలో నిలిచిపోయిన కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి. ఊహించని లాభాల్ని సొంతం చేసుకుంటారు. ఆహార వ్యవహా

Advertiesment
మంగళవారం (17-07-2018) దినఫలాలు - ఆహార వ్యవహారాల్లో మెళకువ...
, మంగళవారం, 17 జులై 2018 (08:30 IST)
మేషం: దంపతుల మధ్య ఏకాగ్రత లోపం అధికమవుతుంది. గతంలో నిలిచిపోయిన కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి. ఊహించని లాభాల్ని సొంతం చేసుకుంటారు. ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. ముఖ్యులలో ఒకరి వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది.
 
వృషభం: విద్యార్థులకు మెడికల్, ఇంజనీరింగ్, కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. ఖర్చులు అధికంగా ఉన్నా డబ్బుకు కొరవ ఉండదు. సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు విదేశీ వస్తువులపై మక్కువ పెరుగుతుంది. ఐరన్, సిమెంట్, కలప, ఇనుము, ఇసుక, ఇటుక వ్యాపారస్తులకు లాభదాయకం. 
 
మిధునం: దైవ కార్యాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఓర్పు, సర్దుబాటు ధోరణితోనే పరిస్థితులు సర్దుకుంటాయి. స్థిరాస్తి అమ్మే విషయంలో పునరాలోచన అవసరం. ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాలవారికి సదవకాశాలు లభిస్తాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. 
 
కర్కాటకం: విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు సంతృప్తినిస్తాయి. ఏ వ్యవహారంలోను ఇతరులపై అతిగా ఆధారపడడం మంచిది కాదు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం మంచిది. గృహంలో ఏవైనా వస్తువులు పోవుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. స్త్రీల తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
సింహం: ఆర్థిక ఒడిదుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. కుటుంబములో ప్రశాంతత నెలకొంటుంది. ప్రతి విషయంలోను నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలు తెలియజేయండి. ప్రైవేటు సంస్థలలో వారికి తోటి వారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. మధ్యవర్తిత్వం వహించడం వలన మాటపడవలసి వస్తుంది. 
 
కన్య: ఉద్యోగస్తులు స్త్రీలతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. దూరప్రయాణాలలో అపరిచితుల పట్ల మెళకువ అవసరం. పారిశ్రామిక కార్మికులలో నెమ్మదిగా మార్పులు కానవస్తాయి. వాహనం నడుపునపుడు మెళకువ వహించండి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు వంటివి ఎదుర్కుంటారు.   
 
తుల: కొంతమంది మీ నుండి విషయాలు రాబట్టడానికి యత్నిస్తారు. క్రయవిక్రయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఉద్యోగస్తులు స్త్రీలతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
 
వృశ్చికం: కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు లాభదాయకం. సాహిత్య సదస్సులలోను, బృంద కార్యక్రమాల్లోను పాల్గొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. అన్ని రంగాలలోని స్త్రీలక చాలా యోగప్రదంగా ఉండగలదు. 
 
ధనస్సు: రాజకీయాల్లో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. నిర్మాణ పథకాలలో జయం చేకూరును. విద్యా, సాంస్కృతిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ మిత్రులలో ఒకరి వైఖరి మీకు చికాకులు కలిగిస్తాయి. మీ సంతానం విద్య, ఆరోగ్య విషయాలు ఆందోళన కలిగిస్తాయి.  
 
మకరం: ఉమ్మడి వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. రవాణా రంగాలలో వారికి లాభదాయకం. ఆలయాలను సందర్శిస్తారు. మిమ్మల్ని పొగిడే వారే కాని సహకరించే వారుండరు. వాహన చోదకులకు ప్రమాదం జరగటానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. 
 
కుంభం: స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురుకావడంతో కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. ఖర్చులు పెరగటంతో కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పూర్య పరిచయ వ్యక్తుల కలయిక సంతృప్తినిస్తుంది. విదేశాలు వెళ్లుటకు చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 
మీనం: పీచు, ఫోము, లెదర్ వ్యాపారస్థులకు లాభదాయకం. స్త్రీలుక అశాంతి పెరుగును. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు. కుటుంబ సభ్యుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల మెుండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ వంకర వెంట్రుకని తిన్నగా చెయ్యమని చెప్పు....