Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాలగ్రామాలకు పూజలు ఎలా చేస్తారో తెలుసా?

సాలగ్రామాలు ఎక్కువగా నలుపు రంగులో దొరుకుతాయి. కాని కొన్ని సాలగ్రామాలు మాత్రం పసుపు, నీలం, ఎరుపు రంగులలో కూడా ఉంటాయి. ఈ సాలగ్రామాలలో ఎరుపు రంగు తప్ప మిగిలిన వన్ని సాలగ్రామాలను ఇంట్లో పూజించుకోవచ్చును.

Advertiesment
సాలగ్రామాలకు పూజలు ఎలా చేస్తారో తెలుసా?
, సోమవారం, 23 జులై 2018 (16:02 IST)
సాలగ్రామాలు ఎక్కువగా నలుపు రంగులో దొరుకుతాయి. కాని కొన్ని సాలగ్రామాలు మాత్రం పసుపు, నీలం, ఎరుపు రంగులలో కూడా ఉంటాయి. ఈ సాలగ్రామాలలో ఎరుపు రంగు తప్ప మిగిలిన వన్ని సాలగ్రామాలను ఇంట్లో పూజించుకోవచ్చును. ఎందుకంటే ఎరుపు రంగు సాలగ్రామాలను ఆలయాలు, మఠాలలో మాత్రమే పూజిస్తారు. కాబట్టి వాటిని ఇంట్లో పూజించకూడదు.
 
ఈ సాలగ్రామాల్లోను చిన్నవిగా ఉండే వాటినే మాత్రమే ఇంట్లో పూజించుకోవాలి. పెద్ద పెద్ద సాలగ్రామాలను ఆలయాల్లో మాత్రమే పూజించాలి. అవి ఏ రంగైనా కావచ్చును. వీటి పూజించేటప్పుడు ధూప దీప నైవేద్యాలతో పాటు తులసిదళాలను తప్పనిసరిగా సమర్పించాలి. ఒకేవేళ ఈ సాలగ్రామలు మీ ఇంట్లో కనుక ఉంటే వాటిని ప్రతిరోజూ మంచినీరు, ఆవుపాలు, పంచామృతాలలో అభిషేకాలు చేయాలి.
 
వీటిని పూజించే వారు నియమబద్ధమైన జీవనం కొనసాగించాలి. మీ జీవిత వ్యవహారాలలో అబద్ధాలు చెప్పడం, ఇతరులను మోసగించడం, కించపరచడం, దుర్భాషలాడడం, దురుసుగా ప్రవర్తించడం, అనవసర దర్పాన్ని ప్రదర్శించడం వంటి దుశ్చర్యలకు పాల్పడకూడదు. భక్తిశ్రద్ధలతో, నియమనిబంధనలలో పూజిస్తే సాలగ్రమాల పూజ సంతోష సౌఖ్యాలను అనుగ్రహిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తొలి ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ద్వాదశి వరకు ఇవి చేస్తే చాలు?