Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోమవారం (30-07-2018) దినఫలాలు - బంధువుల కారణంగా...

మేషం: బ్యాంకింగ్ అధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించండి. విదేశీయానం కోసం చేసే యత్నాలు మందకొడిగా సాగుతాయి. ఇతరులకు సహాయ సహకారాలు అందించుట వలన మీకు సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధు

Advertiesment
Daily Horoscope
, సోమవారం, 30 జులై 2018 (08:42 IST)
మేషం: బ్యాంకింగ్ అధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించండి. విదేశీయానం కోసం చేసే యత్నాలు మందకొడిగా సాగుతాయి. ఇతరులకు సహాయ సహకారాలు అందించుట వలన మీకు సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధువుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది.
 
వృషభం: కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు ఒక కొలిక్కివస్తాయి. పెద్దలలో సోదరీసోదరుల విషయాలు చర్చకు వస్తాయి. ముందుచూపుతో వ్యవహరించి ఒక సమస్య నుండి గట్టెక్కుతారు. ఏదైనా అమ్మకానికై చేయు యత్నాలు వాయిదా పడగలవు. స్త్రీలకు నరాలు, దంతాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
మిధునం: పెన్షన్, భీమా పనులు పూర్తవుతాయి. ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు పురోభివృద్ధి. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్పురిస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదు.  
 
కర్కాటకం: పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
సింహం: శస్త్రచికిత్స చేయునపుడు వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. ఉద్యోగస్తులకు మంచిగుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం అధికమవుతుంది. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది. బిల్డింగ్ కాంట్రాక్టర్లకు తాపి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. 
 
కన్య: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారల నుండి ఒత్తిడి అధికమవుతుంది. పెద్దలలో సోదరీసోదరుల విషయాలు చర్చకు వస్తాయి. క్రీడా కార్యక్రమాల పట్ల ఆసక్తి అధికమవుతుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 
 
తుల: అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మార్కెటింగ్ రంగాలవారికి యాజమాన్యం నుండి అనుక్షణం వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేస్తారు.
 
వృశ్చికం: ఆస్తి వ్యవహాలకు సంబంధించి సోదరులు మధ్య ఒక అవగాహన ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు అందిన ఒక సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ధనం ఇతరులకు ఇచ్చినా తిరగి రాజాలదు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. 
 
ధనస్సు: ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను దీటుగా ఎదుర్కుంటారు. ఆకస్మికంగా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వీలైనంత తక్కువగా మాట్లాడి ఎదుటివారి నుండి సమాచారం రాబట్టేందుకు యత్నించండి. భాగస్వామిక వ్యవహారాల్లో కొత్త ప్రతిపాదనలు చోటు చేసుకుంటాయి.  
 
మకరం: గృహంలో మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదాపడుతాయి. మిత్రుల కలయికటో ప్రశాంతతను పొందుతారు. ఉద్యోగపరంగా మంచి పేరును సంపాదిస్తారు. స్థిరాస్తి అమ్మే విషయంలో పునరాలోచన అవసరం. దేవాలయాలను దర్శనం చేసుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.  
 
కుంభం: ఐరన్ సిమెంట్, కలప రంగాల్లో వారికి నిరుత్సాహం తప్పదు. ప్రింటింగ్ రంగాలవారికి ఆందోళనలు అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఊహాగానాలతో కాలం వ్యర్ధం చేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగస్తులకు కార్యాలయ పనులతో పాటు సొంత పనులు కూడా పూర్తికాగలవు. 
 
మీనం: ఉద్యోగస్తులకు వాహన సౌఖ్యం, పదోన్నతి వంటి శుభపరిణామాలుంటాయి. ప్రేమికుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. మీ మాటకు కుటుంబలోను, సంఘంలోను వ్యతిరేకత ఎదురువుతుంది. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదివారం (29-07-2018) దినఫలాలు - ఇతరులతో అతిగా మాట్లాడడం...