ఇంట్లో పళ్లాలు, బిందెలను మోగిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

దేవాలయాలు మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తాయి. దేవాలయానికి వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ తప్పకుండా గంటను మోగిస్తుంటారు. దర్శనార్థం వచ్చాను స్వామి అనే విషయం దైవానికి తెలియజేయడానికి గంటను మోగించడం జరుగుతుంటుంద

శనివారం, 11 ఆగస్టు 2018 (11:37 IST)
దేవాలయాలు మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తాయి. దేవాలయానికి వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ తప్పకుండా గంటను మోగిస్తుంటారు. దర్శనార్థం వచ్చాను స్వామి అనే విషయం దైవానికి తెలియజేయడానికి గంటను మోగించడం జరుగుతుంటుంది. గంట మోగిన చోట దుష్ట శక్తులు ఉండవని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది.
 
గంటను మోగిస్తే హడలెత్తి పారిపోయే దుష్ట శక్తులు బిందెలను మోగిస్తే పరిగెత్తుకు వస్తాయనేది పెద్దల మాట. కొంతమంది సరదాకి బిందెలను, పళ్లాలను చేతులతో, గరిటలతో మోగిస్తుంటారు. అది దుష్టశక్తులు ఆహ్వానం పలకడం వంటిదని పెద్దల విశ్వాసం. దైవిక శక్తులను మేల్కొలుపుతూ చుట్టూ ఉన్న దుష్టశక్తులను పారద్రోలుతూ ఘంటానాదంతో దేవతలను ఆహ్వానించడానికే గంటను మోగిస్తారు. 
 
దైవిక శక్తులు అంటే మనలోని ధార్మిక భావనలు అని పెద్దల అంతరార్థం కావచ్చు. పైగా అలికిడి ఉన్న ప్రదేశాలలో ఎలాంటి పురుగూ పుట్రా తిరగడానికి ఇష్టపడవు. దేవాలయాలన్నీ ఒకప్పుడు నిర్మానుష్య ప్రదేశాలలో ఉండేవి. ఇప్పటికీ చాలా గుళ్లలోని గర్భాలయాలు చీకటిగా ఉంటాయి. రోజులో ఎప్పుడో ఒకప్పుడు ఘంటానాదం వినిపిస్తూ ఉండటం వలన విషకీటకాలు ఆయా ప్రదేశాలకి దూరంగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 11-08-2018 - శనివారం మీ రాశి ఫలితాలు.. స్త్రీల ఆరోగ్యం మందగించటంతో పాటు?