సర్... మీ విద్యార్హత తెలుసుకోవచ్చా? ఆనంద్ మహీంద్రాకు నెటిజన్ ప్రశ్న

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (08:33 IST)
భారత పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకరైన ఆనంద్‌ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. తనకు వచ్చే ప్రతి పోస్టుకు ఆయన తప్పకుండా రీట్వీట్ రూపంలో బదులిస్తుంటారు. అంతేకాకుంకాడ కష్టాల్లో ఉన్నవారిని గుర్తించి వారికి అండగా నిలుస్తుంటారు. నెటిజన్ల పోస్టులపైనా స్పందిస్తుంటారు. 
 
ఈ క్రమంలోనే తాజాగా 'మీ క్వాలిఫికేషన్‌ తెలుసుకోవచ్చా' అని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఏం జరిగిందంటే.. హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యటిస్తోన్న ఓ వ్యక్తి.. అక్కడి పర్వత ప్రాంతంలో ఓ చిన్నారి ఒంటరిగా కూర్చుని చదువుకుంటున్న ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసి.. ఆమె తపనను కొనియాడారు.
 
అనంతరం.. ఆనంద్‌ మహీంద్రాకూ ఆ పోస్టును ట్యాగ్‌ చేశారు. మహీంద్రా సైతం ఆమె పట్టుదలకు ముగ్ధుడై.. 'అందమైన చిత్రం ఇది. ఈ బాలిక నాకు ప్రేరణ' అని రిప్లై ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్‌ 'సర్‌. మీ క్వాలిఫికేషన్‌ తెలుసుకోవచ్చా' అంటూ మహీంద్రాను ఉద్దేశించి ఆ పోస్టుపై కామెంట్‌ పెట్టారు. 
 
దానికి ఆయన బదులిస్తూ.. 'స్పష్టంగా చెప్పాలంటే, నా వయస్సులో.. ఏ యోగ్యతకైనా కేవలం అనుభవమే అర్హత' అని తెలిపారు. ఈ రిప్లై కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ప్రశ్న అడిగిన వ్యక్తిపై మండిపడిన నెటిజన్లు.. మరోవైపు ఆనంద్‌ మహీంద్రా సమాధానంపై ప్రశంసలు కురిపించారు! 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments