Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుధీక్షా భాటి కేసులో కీలక మలుపు.. ఇన్సూరెన్స్ డబ్బు కోసం చంపేశారు..

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (09:48 IST)
యూపీలోని గౌతమ్‌బుద్ధ్‌ నగర్‌కు చెందిన సుధీక్షా భాటి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈవ్‌టీజింగ్‌ కారణంగా ఆమె మరణించినట్టు అందరూ భావిస్తున్నారు. ఇంకా యువతి ప్రయాణించిన మోటరు సైకిల్‌ను ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నట్టు వాళ్ల మామయ్య నడుపలేదని, ఇటీవలే హైస్కూల్‌ విద్యను పూర్తిచేసిన మైనర్‌ బాలుడు నడిపాడని పోలీసులు తెలిపారు. 
 
అమెరికాలో స్కాలర్‌షిప్‌తో చదువుతున్న భాటి మరణించడం వల్ల పెద్దమొత్తంలో ఇన్సూరెన్స్‌ డబ్బు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ డబ్బు రావడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే వాహనాన్ని మైనర్‌ బాలుడు నడుపలేదని కుటుంబసభ్యులు నమ్మించే ప్రయత్నం చేశారని పోలీసులు ఆరోపించారు. 
 
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించే దీన్ని ధ్రువీకరించినట్టు పోలీసులు తెలిపారు. అలాగే ఈవ్‌ టీజింగ్‌ కూడా జరిగినట్టు ఏమీ ఆధారాలు కనిపించలేదన్నారు. మరోవైపు, 15 మోటరు వాహనాలను బుధవారం స్టేషన్‌కి తీసుకొచ్చి వాటి యజమానులను ప్రశ్నిస్తున్నట్టు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments