Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరాల అడ్డాగా మారిన యూపీ.. నిస్సిగ్గుగా ఫోనులో వీడియో తీసి..?

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (13:24 IST)
ఉత్తరప్రదేశ్‌లో మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. మహోబ జిల్లాలో నలుగురు పాలిటెక్నిక్‌ విద్యార్ధులు యువతి (20)పై సామూహిక లైంగిక దాడికి తెగబడిన ఉదంతం వెలుగుచూసింది. 
 
నిందితులు నిస్సిగ్గుగా తమ అకృత్యాన్ని మొబైల్‌ ఫోన్‌లో వీడియో తీశారు. 19 నుంచి 21 సంవత్సరాలలోపు వయసున్న నలుగురు నిందితులను గౌరవ్‌, వికాస్‌, పుష్పరాజ్‌, సౌరభ్‌గా పోలీసులు గుర్తించారు. మార్చి 21 అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
 
బాధిత యువతిని నిందితులు బలవంతంగా తమ రూమ్‌కు తీసుకువచ్చి దారుణానికి ఒడిగట్టారు. నిందితులు మంగళవారం రాత్రి తమ ఇంట్లోకి చొరబడినప్పుడు తాను ఒంటరిగా ఉన్నానని యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు యువతిని వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించారు. లైంగిక దాడి విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వీడియోను వైరల్‌ చేస్తామని నిందితులు యువతిని హెచ్చరించారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం