Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూర్పు గోదావరిలో కరోనా కలకలం.. ఒకే కుటుంబానికి చెందిన 21 మందికి పాజిటివ్

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (13:16 IST)
తూర్పు గోదావరిలో కరోనా కలకలం రేపింది. తూర్పు గోదావరి తొండంగి మండలంలో ఒకే కుటుంబానికి చెందిన 21 మందికి కరోనా పాజిటివ్‌ తేలింది. ఓ ఇంట్లో నిర్వహించిన భజనలో మరో నాలుగు కుటుంబాలు పాల్గొన్నాయి. వీరిలో కొందరికి జ్వరం రావడంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో 21 మందికి పాజిటివ్‌ అని తేలింది. వారి కుటుంబసభ్యులకు చికిత్స అందిస్తున్నారు. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ 21 మందికి సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఒకే కుటుంబంలో ఇంతమందికి వైరస్‌ సోకడంతో స్థానికులు ఆందోళనలో ఉన్నారు.
 
రాజమహేంద్రవరంలో కూడా కరోనా కేసులు కలకలం రేపాయి. ఓ ప్రైవేట్ కాలేజీలో ఏకంగా 163 మంది విద్యార్థులకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గత రెండు రోజుల నుంచి వరుసగా 13, 10 చొప్పున కేసులు నమోదు అవుతుండగా.. సోమవారం ఒక్క రోజే 140 మందికి వైరస్ సోకిందని తేలింది. 700 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌ వచ్చిన వారిని ఒకే చోట ఉంచి ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా చేశారు. నెగెటివ్‌ వచ్చిన దాదాపు 450 మందిని వేరే హాస్టల్‌లో ఉంచారు. వీరిలో 163 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments