Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పశువుల మేతకోసం వెళ్లిన మైనర్ బాలికపై అత్యాచారం, హత్య..

Advertiesment
పశువుల మేతకోసం వెళ్లిన మైనర్ బాలికపై అత్యాచారం, హత్య..
, బుధవారం, 20 జనవరి 2021 (12:17 IST)
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ప్రతిరోజూ మహిళలపై అఘాయిత్యాలు చోటుచేసుకుంటూనే వున్నాయి. రాష్ట్రంలో జరిగిన హత్రాస్ ఘటన మరవకముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పశువులకు మేతకోసం వెళ్లిన మైనర్‌ బాలికపై దుండగులు లైంగిక దాడికి పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమెను హత్యచేశారు. రాష్ట్రంలోని మహారాజ్‌గంజ్‌ జిల్లా పురెందర్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
ఈనెల 18న బాధితురాలి తల్లి పశువుల మేతకోసం అడవిలోకి వెళ్లింది. గడ్డిని ఇంటికి తీసుకువెళ్లడానికి సైకిల్‌ తీసుకుని రావాలని తన 12 ఏండ్ల కూతురికి చెప్పింది. దీంతో తల్లి వెళ్లిన కొద్దిసేపటికి ఆ బాలిక అడవిలోకి పయణమయ్యింది. అయితే ఆ బాలిక ఎంతసేపైనప్పటికీ తన వద్దకు రాకపోవడంతో.. ఆమె వెతకడం ప్రారంభించింది. అదే రోజు సాయంత్రం పొద్దుపోయిన తర్వాత అటవీ ప్రాంతంలో ఆ బాలిక సైకిల్‌, చెప్పులు కనిపించాయి.
 
కాగా, బాలిక మృతదేహాన్ని గ్రామస్థులు మంగళవారం ఉదయం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు పంపించారు. తమ ఇంటికి 5 వందల మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఆ బాలిక రక్తపు మడుగులో పడి ఉన్నదని పోలీసులు తెలిపారు. 
 
బాలికపై సామూహిక లైంగిదాడికి పాల్పడిన దుండగులు, అనంతరం ఆమెను హత్యచేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నామని మహారాజ్‌గంజ్‌ సీనియర్‌ పోలీసు అధికారి ప్రదీప్‌ గుప్తా తెలిపారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డెలావర్‌ ఎపుడూ నా గుండెల్లోనే ఉంటుంది.. జో బైడెన్