ట్యూషన్‌కు వచ్చిన విద్యార్థితో టీచరమ్మ ప్రేమ... పెళ్లి కుదరడంతో...

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (12:53 IST)
చెన్నై నగర శివారు ప్రాంతమైన అంబత్తూరు కల్లికుప్పంలో ఓ విషాద ఘటన జరిగింది. తన వద్దకు ట్యూషన్‌కు వచ్చిన ఓ టీచరమ్మ.. ప్లట్ విద్యార్థిపై మనస్సు పారేసుకుని, ప్రేమ పేరుతో ముగ్గులోకి దించింది. ఆ తర్వాత ఆ మైనర్ బాలుడిన్ని అన్ని విధాలుగా వాడేసుకుంది. ఆ విద్యార్థి ప్లస్ టూ చదువు పూర్తికావడంతో ట్యూషన్ కూడా మానేశాడు. ఇంతలో టీచరమ్మకు పెళ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులు వరుడుని చూశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి.. నేరుగా ఇంటికి వచ్చి టీచరమ్మను నిలదీశాడు. అందుకు ఆమె సరిగా సమాధానం చెప్పకపోవడంతో మనస్తాపం చెందిన విద్యార్థి ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. మృుతుని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు టీచరమ్మను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. 
 
కల్లికుప్పంకు చెందిన షర్మిల (25) అనే యువతి స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తుంది. ఈమె సాయంత్ర వేళల్లో తన ఇంటి వద్ద పలువురు విద్యార్థులకు ట్యూషన్ చెబుతోంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన 17 యేళ్ల ప్లస్ టూ విద్యార్థి కూడా ఆమె వద్ద ట్యూషన్ చేశాడు. అక్కడ వారిద్దరికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 
 
ఈ క్రమంలో ఆమెకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు వరుడిని చూశారు. దీంతో విద్యార్థితో మాట్లాడటం షర్మిల మానేసింది. ఆ తర్వాత అతడిని పట్టించుకోవడం పూర్తిగా మానేసింది. దీంతో విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. షర్మిల జీవితం వృథా అని భావించిన ఆ విద్యార్థి ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments