Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజీవనం చేసి దూరం పెడుతున్నాడని ప్రియుడిపై యాసిడ్ పోసిన యువతి!

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (10:28 IST)
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన త్రిపురలో దారుణం జరిగింది. తనతో కలిసి సహజీవనం చేసిన వ్యక్తి ఇపుడు దూరం పెడుతుండటాన్ని జీర్ణించుకోలేని ఓ యువతి అక్రోశంతో అతనిపై యాసిడ్‌తో దాడి చేసింది. ఈ దారుణ ఘటన ఆ రాష్ట్ర రాజధాని అగర్తలాకు 50 కిలోమీటర్ల దూరంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, త్రిపురకు చెందిన బీనా (27) అనే మహిళ, సోమన్ (30) అనే వ్యక్తి పక్కపక్క ఇళ్లలో నివసిస్తూ వచ్చారు. వీరిద్దరూ ప్రేమించుకొని పదేళ్ల కిందట ఇంటి నుంచి వెళ్ళిపోయారు. 2010 నుంచి మహారాష్ట్రలోని పుణెలో సహాజీవనం చేస్తూ అక్కడే జీవిస్తున్నారు. 
 
అదేసమయంలో సోమన్‌ చదువు కొనసాగించడానికి అవసరమైన డబ్బులను బీనా ఉద్యోగం చేస్తూ సమకూర్చేది. అనంతరం సోమన్‌కు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేస్తూ కాపురం చేస్తున్నారు. తొమ్మిదేళ్లుగా పుణెలో బీనాతో కలిసి ఉన్న సోమన్‌ 2019లో సొంత రాష్ట్రానికి తిరిగొచ్చేశాడు.
 
అప్పటి నుంచి బీనాతో సోమన్ మాట్లాడటం మానేశాడు. సోమన్‌ కోసం ఆ మహిళ సంవత్సరం నుంచి చాలా ప్రాంతాల్లో వెతికినా అతని ఆచూకీ లభించలేదు. ఎట్టకేలకు అక్టోబరు 19న త్రిపురలోని ఖోవై ప్రాంతంలో సోమన్‌ను ఉన్నట్లు బీనా గుర్తించింది. అతనితో మాట్లాడటానికి ఎంతగా ప్రయత్నించినా సోమన్‌ నిరాకరించడంతో ఆమె విచక్షణ కోల్పోంది. 
 
ఇదే క్రమంలో తనతో మాట్లాడకుండా దూరం పెడుతున్నాడన్న కోపంతో ఉన్న అతనిపై యాసిడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో సోమన్ తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు బీనాను అరెస్టు చేశారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments