Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యను కొట్టిన భర్త, అది తట్టుకోలేక చంపేసిన ప్రియుడు

Advertiesment
భార్యను కొట్టిన భర్త, అది తట్టుకోలేక చంపేసిన ప్రియుడు
, శుక్రవారం, 16 అక్టోబరు 2020 (20:54 IST)
ఆమెకు పెళ్ళయ్యింది. అయినా పెళ్ళికి ముందు సంబంధాన్ని మాత్రం ఆపలేకపోయింది. ఒక పక్క భర్తతో.. మరో పక్క ప్రియుడితో రొమాన్స్ చేసింది. అయితే భర్తకు విషయం తెలియదు. కానీ భర్త కావాలని భార్యతో చీటికిమాటికీ గొడవపడటం కొట్టడం చేసేవాడు. ఇది కాస్త తెలిసిన ప్రియుడు తట్టుకోలేక అతన్ని చంపేసి చివరకు కటాకటాల పాలయ్యాడు.
 
ముంబై సమతౌనగర్ ప్రాంతంలో నివాసముండే మహేష్ యాదవ్ రెండురోజుల క్రితం దారుణ హత్యకు గురయ్యాడు. అది కూడా తన భార్య పుట్టినరోజు వేడుకల్లోనే. వేడుకలు జరుగుతుండగా బాత్రూంకు వెళ్ళి శవమై కనిపించాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
 
మహేష్‌ను ఎవరు చంపారో పార్టీకి వచ్చిన వారు ఎవరూ చెప్పలేకపోయారు. కానీ పోలీసులు మాత్రం కేసును సవాల్‌గా తీసుకున్నారు. ముందుగా భార్యను అదుపులోకి తీసుకుంటే పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో ఆమె కూడా భాగస్వామ్యురాలని నిర్థారించుకున్నారు. పోలీసుల తమదైన శైలిలో విచారణ చేసారు. దీంతో నిజాలన్నీ ఒప్పుకుంది. సచిన్ యాదవ్ అనే వ్యక్తితో తనకు అక్రమ సంబంధం ఉందని చెప్పింది. అయితే ఇంట్లో వంట చేయలేదని.. ఇల్లు శుభ్రంగా పెట్టుకోలేదని తన భర్త తరచూ కొట్టేవాడని చెప్పింది.
 
గత వారంరోజుల క్రితం తన ప్రియుడు తన ఇంటివైపుగా వెళుతూ తన భర్త తనను కొట్టడాన్ని చూశాడని.. అది తట్టుకోలేకపోయాడని చెప్పుకొచ్చింది. నీ భర్తను నీ పుట్టినరోజు చంపేస్తానని తనకు చెప్పాడని.. చెప్పిన మాట ప్రకారమే చంపేశాడని పోలీసుల విచారణలో ఒప్పుకుంది. దీంతో నిందితుడిని, సహకరించిన భార్యను ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ దౌర్భాగ్యానికి కేసీర్ కారణం: విజయశాంతి ఫైర్