Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాలగ్లాసుతో గదిలోకి భార్య, కోటి తెస్తేనే ఒంటిపై చెయ్యేస్తానన్న భర్త, ఎక్కడ?

పాలగ్లాసుతో గదిలోకి భార్య, కోటి తెస్తేనే ఒంటిపై చెయ్యేస్తానన్న భర్త, ఎక్కడ?
, గురువారం, 15 అక్టోబరు 2020 (20:14 IST)
అతనో సాఫ్ట్వేర్ ఇంజనీర్. బాగా సంపాదిస్తున్నాడు. అందుకే అతనికి బాగా కట్నం ఇచ్చి వివాహం చేశారు పెళ్ళికూతురు తల్లిదండ్రులు. అయితే కరోనా పుణ్యమా అని ఉద్యోగం పోయింది. చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోయాయి. కానీ తనకు డబ్బులు తెచ్చిపెట్టే బంగారు బాతులా భార్య కనిపించింది. అంతే శాడిస్ట్‌లా మారిపోయిన భర్త ఆమెను వేధించడం ప్రారంభించాడు.
 
కడపకు చెందిన గాయత్రికి అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన దీపక్‌కు 2018 సంవత్సరంలో వివాహమైంది. దీపక్ బెంగుళూరులో ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. రెండు చేతులా బాగా సంపాదిస్తూ ఉండటంతో గాయత్రి తల్లిదండ్రులు అప్పట్లోనే 20 లక్షల నగదు, 10 లక్షల బంగారం కింద కట్నం ఇచ్చి వివాహం చేశారు. 
 
కరోనా ముందు గర్భవతి అయ్యింది గాయత్రి. పుట్టింటికి పంపాడు దీపక్. కరోనా కారణంగా బెంగుళూరు వెళ్ళలేక పుట్టింటిలోనే ఉండిపోయింది. అయితే కరోనా కారణంగా సాఫ్ట్వేర్ రంగం కుదేలైపోయింది. దీంతో దీపక్ ఉద్యోగం పోయింది. చేతిలో ఉన్న డబ్బులు అయిపోయాయి.
 
డబ్బులు ఎలాగైనా సంపాదించాలని నాటుసారా వ్యాపారం ప్రారంభించాడు దీపక్. స్నేహితులతో కలిసి ఈ వ్యాపారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. విషయం తెలుసుకుని భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులు బెంగుళూరుకు వెళ్ళి దీపక్‌కు బెయిల్ వచ్చేలా చేసి విడిపించారు.
 
చాలారోజుల తరువాత భర్తను కలవడంతో గాయత్రి పాల గ్లాసుతో గదిలోకి వెళ్ళిందట. అయితే భార్య తరపు తల్లిదండ్రుల ఆస్తిని ఎలాగైనా లాగేయాలని ముందుగానే ప్లాన్ వేసిన దీపక్ డబ్బు తెస్తేనే నీతో సంసారం చేస్తానన్నాడట. డబ్బు కోసం భార్యను చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడట. మీ నాన్న దగ్గర ఆస్తులు ఉన్నాయిగా కోటి తీసుకురా.. డబ్బు తెస్తేనే నీ ఒంటిపై చేయి పెడతా అంటూ కోపంతో ఊగిపోతూ ఆమెను చితక్కొట్టేవాడట. 
 
దీంతో బాధితురాలు తల్లిదండ్రులు చెప్పలేక చివరకు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా అతనిలో మార్పు రాలేదని మరోసారి పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. తనకు జరిగిన అన్యాయాన్ని పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పిందట బాధితురాలు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో పాఠశాలలకు సెలవులు తగ్గింపు, సంక్రాంతికి మూడు రోజులు మాత్రమే