Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష

Webdunia
గురువారం, 19 మే 2022 (15:42 IST)
భారత మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. 30 ఏండ్ల కిందటి ఓ కేసులో సిద్ధూకు ఏడాది జైలు శిక్ష పడింది.
 
1988 డిసెంబర్ 27న సిద్ధూ ఒక వాగ్వాదం సమయంలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిపై దాడి చేయడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పును గురువారం వెల్లడించింది.
 
ఈ ఘటనలో సిద్ధూపై ఐపీసీ సెక్షన్ 304ఏ కింద కేసు నమోదైంది. ఈ కేసు సెషన్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. పాటియాలాలోని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి 1999 సెప్టెంబర్ 22న ఈ కేసులో సాక్ష్యాధారాలు లేకపోవడంతో సిద్ధూ, అతని సహచరులను నిర్దోషులుగా ప్రకటించారు. 
 
దీనిపై బాధిత కుటుంబాలు పంజాబ్, హర్యానా హైకోర్టులో సవాల్ చేశాయి. 2006లో సిద్ధూను దోషిగా నిర్ధారిస్తూ ధర్మాసనం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 
 
ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన భారత అత్యున్నత న్యాయస్థానం ఏడాది జైలు శిక్షను విధిస్తూ గురువారం తుది తీర్పు వెలువరించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments