Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పెళ్లికి నో చెప్పిన తల్లిదండ్రులు.. సూసైడ్ చేసుకున్న మహిళా పోలీసు

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (09:21 IST)
తాను ప్రేమించిన యువకుడితో పెళ్లికి నిరాకరించడంతో ఓ మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తిరుచ్చిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుచ్చి ఎడమలై పట్టి పుదూరు క్రాపట్టి పోలీసు క్వార్టర్స్‌లో రాజ్యలక్ష్మి (24) నివాసం ఉంటుంది. ఈమె జిల్లా సాయుధ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. 
 
ఈమె పెట్టవాయ్‌తలైకు చెందిన హోమ్‌గార్డ్‌ శివకుమార్‌ను గత కొంత కాలంగా రాజ్యలక్ష్మి ప్రేమిస్తోంది. అయితే వీరి వివాహానికి ఇరు వైపుల పెద్దలు ఒప్పుకోలేదు. ఇదే విషయమై శనివారం రాత్రి శివకుమార్, రాజ్యలక్ష్మి సెల్‌ఫోన్‌లో చాలా సేపు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో రాజ్యలక్ష్మి ఆగ్రహంతో కాల్‌ కట్‌ చేసింది.
 
ఆదివారం ఉదయం శివకుమార్‌ రాజ్యలక్ష్మికి ఫోన్‌ చేయగా ఆమె లిఫ్ట్‌ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన శివకుమార్‌ హూటాహుటిన క్రాపట్టి పోలీసు క్వార్టర్స్‌ చేరుకుని రాజ్యలక్ష్మి గదికెళ్ళి చూశాడు. అప్పటికే రాజ్యలక్ష్మి విషం తాగి అచేతనంగా పడివుండటాన్ని గుర్తించిన శివకుమార్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments