Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ చిత్రపటంలో 2025 నాటికి పాకిస్థాన్ ఉండదు : ఆర్ఎస్ఎస్

Webdunia
ఆదివారం, 17 మార్చి 2019 (17:07 IST)
వచ్చే 2025 సంవత్సరం నాటికి ప్రపంచ చిత్రపటంలో పాకిస్థాన్ ఉండదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఆర్ఎస్) సీనియర్ నేత ఇంద్రేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌ సమస్యపై ముంబైలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యూరోపియన్‌ యూనియన్‌ మాదిరి అఖండ భారత్‌ రూపొందడానికి దారులు తెరుచుకున్నారు. 
 
రానున్న 5 నుంచి ఏడేళ్లలో కారాచీ, లాహోర్‌, రావల్పిండిలలో ఇళ్లు కొనుక్కోవాలనే, బిజినెస్‌ చేయాలనే కల నెరవేరబోతుందనే విషయాన్ని రాసిపెట్టుకోండన్నారు. '1947కు మందు పాకిస్థాన్‌ అనేది లేదు.. 1945కు ముందు ప్రజలు దానిని హిందూస్థాన్‌లో భాగంగానే పరిగణించేవారు. అలాంటి పాకిస్థాన్‌ మళ్లీ 2025 తర్వాత తిరిగి హిందూస్తాన్‌లో భాగం కానుంది. అఖండ భారత్‌ కల కూడా సాకరమవుతుందనే నమ్మకం కలుగుతోందన్నారు.
 
తొలిసారిగా భారత ప్రభుత్వం కాశ్మీర్‌ సమస్యపై కఠిన వైఖరి తీసుకుంది.. తద్వారా సైన్యానికి ఆత్మవిశ్వాసం పెరిగింది. తాజాగా కాశ్మీర్‌లో పరిస్థితులు మారాయి. ఇకపై లాహోర్‌లో జీవించడానికి.. చైనా అనుమతి తీసుకోకుండా మానసరోవరం వెళ్లడానికి కలలు కనవచ్చన్నారు. అదేసమయంలో పాకిస్థాన్ ఒక నాటికి భారత్‍లో అంతర్భాగం కాలేదన్నారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments