ఓ మహిళ పిచ్చి ప్రవర్తన కారణంగా విమానాశ్రయంలో హడావుడి చోటుచేసుకుంది. ఆమెను ఎక్కిన ఫ్లైటు దించి తనిఖీలు చేపట్టారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విక్టోరియా దేశానికి చెందిన రిచెల్లీ మారిస్సా(42) అనే మహిళ వర్జిన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఎక్కే సమయంలో తన బ్యాగ్‌లో బాంబు ఉందని, అధికారులను, ప్రయాణీకులను హడలెత్తించింది. వెంటనే పోలీసులు ఆమె లగేజీని తనిఖీ చేశారు. తాను సరదాగా జోక్ చేసానని చెప్పింది.
అలా చెబితే ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఈ పని చేశానని చెప్పింది. దీనికి సీరియస్ అయిన అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. గతంలో ఓ కారు డ్రైవరు తనకు ఈ జోక్ చెప్పాడని అందుకే విమానం ఎక్కే ముందు ఆ విధంగా ప్రవర్తించానని మహిళ కోర్టులో చెప్పింది. ఎవరో చెప్పారని చట్టంతో చలాగాటాలాడటం నేరమని ఆమెకు గట్టి వార్నింగ్ ఇచ్చింది.
గత సంవత్సరం డిసెంబర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం ఆమె కోర్టులో నేరాన్ని అంగీకరించి విమానాశ్రయ అధికారులకు క్షమాపణ చెప్పింది. ఆమె మానసిక పరిస్థితి బాగాలేకే ఇలా ప్రవర్తించిందని గుర్తించిన కోర్టు ఆమెకు 800 డాలర్ల జరిమానా విధించి వదిలేసింది.