Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరాఠీలను వణికిస్తున్న గిలియన్ బార్ సిండ్రోమ్

ఠాగూర్
ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (19:26 IST)
మహారాష్ట్రలో ప్రజలను గిలియన్ బార్ సిండ్రోమ్ (జీబీఎస్) వణికిస్తుంది. జీబీఎస్ కేసులు నానాటికీ పెరిగిపోతున్నయి. ఈ సిండ్రోమ్ శరవేగంగా వ్యాపిస్తుంది. దీనికి కారణమే శనివారం కొత్తగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో జీబీఎస్ కేసుల సంఖ్య మొత్తం 183కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 151 మంది కోలుకోగా, ఆరుగురు మరణించారు. ఇటీవల ముంబైలో 64 యేళ్ల వృద్ధురాలికి జీబీఎస్ వ్యాధి ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఆ మహిళకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్థానికంగా నీటి శాంపిల్స్‌ను పరీక్షించడంతో శనివారం మరో రెండు నీటి వనరులు కలుషితమైనట్టు తెలిపింది. 
 
గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో జీబీఎస్ కేసులు నమోదవుతున్న విషయం తెల్సిందే. దీంతో ఈ సిండ్రోమ్ ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు స్థానికులకు ఆందోళనకు గురిచేస్తుంది. 
 
ఈ సిండ్రోమ్ సోకిన వారికి ఒళ్ళంతా తిమ్మిరిగా అనిపిస్తుంది. కండరాలు బలహీనంగా మారడం, డయేరియా, పొత్తి కడుపు నొప్పి, జ్వరం, వాంతులు రావడం వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. 
 
కలుషిత ఆహారం, నీటి ద్వారా ఆ బ్యాక్టీరియా సోకుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, జీబీఎస్ అంటువ్యాధి కాదని చికిత్సతో నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'తల' మూవీ నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల

బాలకృష్ణను సత్కరించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

తర్వాతి కథనం