Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాల్వాన్ లోయపై కన్నుపడిన వారికి ధీటుగా బదులిచ్చాం : ప్రధాని మోడీ

Webdunia
ఆదివారం, 28 జూన్ 2020 (12:24 IST)
లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయపై కన్నుపడిన వారికి ధీటుగా బదులిచ్చినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. స్నేహంగా ఎలా ఉండాలో భారత్‌కు బాగా తెలుసనీ, అదే తేడా వస్తే ఎలా నడుచుకోవాలో కూడా భారత్‌కు బాగానే తెలుసన్నారు. 
 
గాల్వన్‌ లోయ వద్ద చైనా సైనికులతో జూన్‌ 15న చోటు చేసుకున్న ఘర్షణలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం మరోమారు స్పందించారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. గాల్వన్‌ లోయపై కన్ను పడిన వారికి ధీటుగా బదులిచ్చామన్నారు. 
 
స్నేహంగా ఎలా ఉండాలో భారత్‌కు తెలుసని, అలాగే, ఎలా ధీటుగా బదులివ్వాలో కూడా తెలుసని వ్యాఖ్యానించారు. సరిహద్దుల వద్ద దేశాన్ని కాపాడే క్రమంలో 20 మంది సైనికులు ప్రాణ త్యాగం చేశారని ఆయన కొనియాడారు. దేశంలో మనం సమస్యలు లేకుండా జీవించేందుకు సైనికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టారని చెప్పారు.
 
కరోనా కష్టకాలంలో దేశం స్వావలంబన దిశగా ముందుకు సాగేందుకు పౌరులంతా కృషి చేయాలని మోడీ చెప్పారు. దేశీయ ఉత్పత్తుల వాడకానికే ప్రాధాన్యత ఇవ్వాలని, సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలని చెప్పారు. 
 
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి నిబంధనలు పాటించకపోతే ప్రమాదమని తెలిపారు. 2020లో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని ఆయన చెప్పారు. అన్ని సవాళ్లను ధీటుగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments