Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలో అతిపెద్ద హ్యాండ్‌మేడ్‌ కార్పెట్‌ను తీర్చిదిద్దిన పటోడియా కాంట్రాక్ట్‌

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (15:24 IST)
గత సంవత్సరం, 2021 వేసవిలో కొవిడ్‌ మహమ్మారి భయాలతో ప్రపంచం వణుకుతూ చిరు ఆశ కోసం వెదుకుతూ, భయాన్ని ఎదుర్కొనే ధైర్యం కోసం  ఎదురుచూస్తోన్న వేళ, భారతదేశంలో కార్పెట్‌ నగరంగా ఖ్యాతి గడించిన భదోహిలో ఓ భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం పడింది. మధ్య ఆసియాలో అతి పెద్ద మసీదుగా ఖ్యాతి గడించిన కజకిస్తాన్‌లోని నుర్‌-సుల్తాన్‌ మసీదు కోసం పటోడియా కాంట్రాక్ట్‌ ఈ ప్రాజెక్ట్‌ చేపట్టింది.
 
ప్రపంచంలో అతి పెద్ద హ్యాండ్‌మేడ్‌ కార్పెట్‌గా 12 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ  కార్పెట్‌ను తీర్చిదిద్దారు. ఈ కార్పెట్‌లో మెడాలియన్‌ 70 మీటర్ల వ్యాసార్థంతో ఉండగా, 80 టన్నుల న్యూజిలాండ్‌ ఊల్‌ స్పన్‌ వినియోగించారు. వెయ్యి మంది కార్మికులు ఆరు నెలలు శ్రమించి తీర్చిదిద్దారు. ఈ కార్పెట్‌లో ప్రధానంగా రెండు డిజైన్‌లు ఉంటాయి. మసీదులో కోర్ట్‌యార్డ్‌ సెంటర్‌పీస్‌గా వృత్తం, దానిచుట్టూ 8 గొడ్డళ్లు ఉంటే, జన్నత్‌ ఉల్‌ ఫిరదౌస్‌ స్ఫూర్తితో ఇంకో డిజైన్‌ ఉంటుంది.
 
ప్రపంచంలో ఇప్పటివరకూ ఎప్పుడూ ఇంతటి భారీ స్థాయిలో హ్యాండ్‌మేడ్‌ కార్పెట్‌ను తీర్చిదిద్దిన చరిత్ర లేదు. ఈ కార్పెట్‌కు సంబంధించి యార్న్‌ స్పిన్నింగ్‌ మొదలు, సైట్‌లో దాని ఇన్‌స్టాలేషన్‌ వరకూ మొత్తం కార్యక్రమాన్ని పటోడియా కాంట్రాక్ట్‌ నిర్వహించింది. నెలకు 25వేల చదరపు మీటర్ల కార్పెట్‌ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన పటోడియా ప్రతి దశలోనూ నాణ్యత నియంత్రణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది.
 
మధ్య ఆసియాలో అతి పెద్ద మసీదు కోసం కార్పెట్‌ రూపకల్పనలో అనేక జాగ్రత్తలను పటోడియా కాంట్రాక్ట్‌ తీసుకుంది. మసీదు నిర్మాణానికి సంబంధించి ప్రతి సూక్ష్మ అంశమూ అంటే ముఖ్యమైన చాండ్లియర్‌, కార్నర్స్‌, ఫ్లోరింగ్‌, కన్వర్జింగ్‌ వాల్స్‌, పిల్లర్లు వంటివి  పరిగణలోకి తీసుకుని కార్పెట్‌ తీర్చిదిద్దారు. హ్యాండ్‌ నాటెడ్‌, హ్యాండ్‌ ఓవెన్‌, హ్యాండ్‌ టఫ్టెడ్‌ కార్పెట్ల తయారీ పరంగా సుప్రసిద్ధమైనది పటోడియా కాంట్రాక్ట్‌. ఈ కంపెనీ 1881 నుంచి కార్పెట్‌ తయారీ రంగంలో ఉంది.  ప్రపంచంలో అగ్రగామి కార్పెట్‌ డిజైనర్లతో భాగస్వామ్యం చేసుకుని కస్టమైజ్డ్‌ కార్పెట్స్‌ను సైతం అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం