Webdunia - Bharat's app for daily news and videos

Install App

పామును రక్షించబోయీ.... ఏమైందో చూడండి

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (13:48 IST)
ఓ పాము బావిలో పడిపోయింది. ఇది తెలుసుకున్న పాముల సహాయకుడు షగిల్‌ వెంటనే అక్కడికి చేరుకుని దానికి సహాయం చేయబోయాడు. కానీ చివరాఖరకు అతనికే వేరేవాళ్లు సహాయం అందించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్‌లో చోటు చేసుకుంది. ఓ పాము బావిలో పడటంతో షగిల్‌.. వల వేసి దాన్ని బయటకు తెద్దామనుకున్నాడు. కానీ ఆ బావి లోతుగా ఉండటంతో అది కుదర్లేదు. దీంతో అతనే నేరుగా బావిలోకి దూకి రక్షించాలనుకున్నాడు. వెంటనే తాళ్ల సాయంతో ఎలాగోలా బావిలోకి దిగాడు.

పాము కాటు వేయకుండా నెమ్మదిగా దాని తలను అదిమి పట్టుకున్నాడు. వెంటనే ఆ పొడవాటి పాము ఏదో ప్రమాదం జరుగుతున్నదానిలా అతని శరీరాన్ని చుట్టుకుంది. దీంతో అక్కడి స్థానికులు అతడిని పైకి లాగారు.

హమ్మయ్య, పైకి వచ్చేసా అనుకున్న సమయంలో చేయి పట్టుతప్పడంతో ఒక్కసారిగా పాముతో పాటు అతను కూడా బావిలోకి పడిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అతనికి, పాముకు ఎలాంటి గాయాలు కాలేదు. తిరిగి ఆ పామును అడవిలో విడిచిపెట్టారు.

ఈ ఘటనపై షగిల్‌ మాట్లాడుతూ ‘పామును సురక్షితంగా బయటకు తీసుకురావడానికి నేనే ఓ తాడు కట్టుకుని నేరుగా బావిలోకి దిగాను. అది నన్ను కాటు వేయకుండా తల పట్టుకుని పై దాకా వచ్చాను. అక్కడున్న వారిని నా చేయి పట్టుకోమని సహాయం అడిగాను. కానీ వాళ్లు ఆలస్యం చేయడంతో అంతలోనే పట్టు కోల్పోయి బావిలో పడిపోయా’నని చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments