Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుక్క పిల్లలపై పంజా విసిరిన నాగుపాము

Advertiesment
కుక్క పిల్లలపై పంజా విసిరిన నాగుపాము
, శనివారం, 12 అక్టోబరు 2019 (14:41 IST)
నాగుపాము కాటుకు రెండు కుక్క పిల్లలు ప్రాణాలు కోల్పోయాయి. నిద్రిస్తున్న కుక్క పిల్లలను చుట్టుముట్టిన పాము.. బుసలు కొడుతూ కుక్క పిల్లలపై పంజా విసిరింది. దీంతో రెండు కుక్క పిల్లలు స్పాట్‌లోనే చనిపోయాయి.

ఎల్‌బీనగర్‌లోని నాగోల్‌ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. తన పిల్లలకు అపాయం తలపెడుతుందన్న విషయం తెలుసుకున్న తల్లి కుక్క.. ఘటనా స్థలానికి చేరుకుని అరవడం మొలుపెట్టింది.

గట్టిగా అరుస్తూ పామును తరిమేందుకు ప్రయత్నించింది. కానీ ఆ నాగుపాము అదరలేదు. బెదరలేదు. పైగా తల్లి కుక్క అరుస్తుండగానే కుక్క పిల్లలను బుసలు కొడుతూ కాటేసింది. దీంతో తన పిల్లలు కళ్లెదుటే చనిపోతుండడాన్ని చూసి తల్లి కుక్క తల్లడిల్లిపోయింది.

చాలా సేపు కుక్క అరవడంతో ఆ పాము అక్కడి నుంచి చిన్నగా జారుకుంది. ఈ దృశ్యాలు సెల్‌ ఫోన్లలో రికార్డు చేశారు స్థానికులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇద్దరు చిన్నారులపై మైనర్ బాలుడు అత్యాచారం