Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో వాదించలేక నాలుక కోసేసుకున్న భర్త

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (09:45 IST)
సహజంగా ఆడవారిపైనే వేధింపులు ఎక్కువ నమోదవుతుంటాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్. భార్య వేధింపులు తాళలేని ఆ భర్త ఏకంగా నాలుక కోసేసుకున్నాడు. ఈ ఘటన కాన్పూరులో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే... కాన్పూరు జిల్లా గోపాల్‌పూర్ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు నిషా, ముఖేష్ అనే భార్యాభర్తలు. ఐతే ఈమధ్య కాలంలో భర్తతో నిషా తరచూ గొడవపడుతోంది. భర్త ఎంత సర్దుకు పోదామని చూస్తున్నా ఆమె అతడిపై రేగు కంపలా పడుతోంది. తిట్ల పురాణం అందుకుంటోంది. దీంతో ఇద్దరి మధ్య వివాదం తారాస్థాయికి వెళ్లడంతో నిషా భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.
 
ఎంతకీ రాకపోయేసరికి ముఖేష్ తనే తలొగ్గి భార్యకు ఫోన్ చేసాడు. కలిసి వుందామనీ, గొడవలు వద్దని నచ్చజెప్పాడు. ఐతే ఆమె ఆ సందర్భంలో కూడా గయ్యమంటూ గొడవకు దిగింది. దీనితో ఆమెతో వాదించలేని భర్త బ్లేడుతో తన నాలుకను కోసేసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో కేకలు పెట్టాడు. ఇరుగుపొరుగువారు గమనించి అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments