Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చేతివేలికి ఉన్న ఉంగరం ముక్కుకు తగిలి రక్తం వచ్చిందట.. డెలివరీ బాయ్..?

చేతివేలికి ఉన్న ఉంగరం ముక్కుకు తగిలి రక్తం వచ్చిందట.. డెలివరీ బాయ్..?
, శుక్రవారం, 12 మార్చి 2021 (15:03 IST)
ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్‌ హితేషా చంద్రానీ అనే యువతి.. ఫుడ్‌ డెలివరీ బాయ్‌ తనపై పిడి గుద్దులు కురిపించాడంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆలస్యం అయ్యిందని.. ఎందుకని అడిగితే.. రక్తం వచ్చేలా తనపై దాడి చేశాడంటూ ఆమె విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. దీంతో డెలివరీ బాయ్ కామరాజ్‌‌, జొమాటోపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఇలాంటి పరిస్థితుల్లో మహిళా కస్టమర్‌-ఫుడ్‌ డెలివరీ బాయ్‌ వివాదంపై జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపేందర్‌ గోయల్‌ స్పందించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. అప్పటి వరకు హితేషా చంద్రాణి వైద్య ఖర్చులు, అదే విధంగా అరెస్టైన డెలివరీ బాయ్‌ లీగల్‌ ఖర్చులు తామే భరిస్తామని స్పష్టం చేశారు. ఇద్దరికీ మద్దతుగా నిలుస్తామన్నారు. 
 
అలాగే డెలివరీ బాయ్ కూడా జరిగిన నిజాలు గురించి వెల్లడించారు. హితేషాపై దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కామరాజ్ ఇప్పటివరకు ఐదు వేల ఫుడ్ డెలివరీలు చేశాడు. అతని ఖాతాలో 4.75/5 రేటింగ్‌ వుంది. హితేష విషయంలోనూ తాను తప్పు చేయలేదని.. ఆమెకు భోజనం అందించిన తర్వాత బిల్లు చెల్లించమని అడిగాను.
 
అంతేకాదు ట్రాఫిక్‌జాం వల్ల ఆలస్యమైందని, అందుకు క్షమాపణ కోరాను, అయితే ఫుడ్ క్యాన్సిల్ చేశాక ఆ ఫుడ్‌ను తిరిగి ఇవ్వలేదని.. ఇక లాభం లేదనుకుని తిరిగి వెళ్దామని డెలివరీ బాయ్ నిర్ణయించుకుంటే.. అంతలోనే హిందీలో తిట్టడం మొదలుపెట్టింది. 
 
అలాగే నన్ను నెట్టివేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె చేతివేలికి ఉన్న ఉంగరం ముక్కుకు తగిలి రక్తం వచ్చింది. ఆమె ముఖాన్ని సరిగ్గా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. నేను తనపై చేయి చేసుకోలేదని స్పష్టంగా తెలుస్తుందని కామరాజ్ వెల్లడించాడు. ఇక కేసులో ఇరుక్కున్న కారణంగా చట్టపరంగా ముందుకు వెళ్లేందుకు, తనకు ఇప్పటికే రూ. 25 వేలు ఖర్చయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంది.. అయినా... చిదంబరం కామెంట్స్