Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణం: శవాల మీద దుస్తులూ వదలట్లేదు

Webdunia
మంగళవారం, 11 మే 2021 (14:44 IST)
బాగ్‌పట్‌ (యూపీ): కరోనా రోగుల నుంచి వైద్యం పేరిట ఆసుపత్రులు దోచుకోవడం చూశాం. కొన్నిచోట్ల బాధితుల ఆభరణాలు మాయమైన ఘటనల గురించి విన్నాం. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఈ ముఠాది కొత్త దందా! కరోనాతో మరణించిన వారి దుస్తులు దొంగిలించడం, వాటిని ఉతికి మళ్లీ విక్రయించడం వీరి పని! ఈ విధంగా శ్మశానవాటికల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను యూపీలోని బాగ్‌పట్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు.
 
కొవిడ్‌ మృతదేహాలపై కప్పిన ముసుగులు సహా, చీరలు, కుర్తాలు, బెడ్‌షీట్లు, ఇతర వస్తువులను ఈ ముఠా చోరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి మొత్తం 520 బెడ్‌షీట్లు, 127 కుర్తాలు, 52 చీరలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇలా చోరీ దుస్తులను బాగా ఉతికి, ఇస్త్రీ చేసి కొత్త లేబుళ్లు వేసి విక్రయిస్తున్నారని చెప్పారు.

స్థానికంగా ఉండే వ్యాపారులు ఇలాంటి వారితో డీల్‌ కుదుర్చుకుని, వారికి రోజుకు రూ.300 చొప్పున చెల్లించి ఇలాంటి పనులు చేయిస్తున్నట్లు కూడా తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అరెస్టయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, వారిపై అంటు వ్యాధుల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కరోనా కాలంలో ఇంకెన్ని దారుణాలు చూడాలో!!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments