Publish Date: Fri, 26 Jun 2020 (11:46 IST)
Updated Date: Fri, 26 Jun 2020 (11:47 IST)
జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని వస్త్ర వ్యాపారులు ఆయా ప్రాంతాల్లోని దుకాణాలను మూసివేస్తున్నారు.
నేటి నుంచి వచ్చే నెల 5 వరకు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేయాలని నిర్ణయించారు. నగరంలో కరోనా వైరస్ వ్యాప్తికి తాము కారణం కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సికింద్రాబాద్ చేనేత, సిల్కు, వస్త్ర దుకాణదారుల సంఘం అధ్యక్షుడు టి.అశోక్ కుమార్ తెలిపారు.
మరోవైపు, సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని నగల వ్యాపారులు కూడా ఇదే నిర్ణయానికి వచ్చారు. అంతేకాదు, నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హోల్‌సేల్ దుకాణదారులు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు.