Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుంటూరులో ఎప్పుడు లేని విధంగా స్మశానాలు శవాలతో నిండిపోతున్నాయి

గుంటూరులో ఎప్పుడు లేని విధంగా స్మశానాలు శవాలతో నిండిపోతున్నాయి
, శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (23:11 IST)
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం మాట్లాడుతూ, ప్రభుత్వం కారోన నియంత్రణ చర్యల పై బీజేపీ పార్టీ తరుపున కొన్ని సూచనలు చేస్తున్నామని వ్యాక్సినేషన్ మొదటి దశ వ్యాక్సిన్ తీసుకున్నవారికి.... రెండో దశ వ్యాక్సిన్ ఇవ్వటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
 
రాష్ట్రంలో కోవిడ్ వచ్చిన వారికి ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొందని ఏ హాస్పిటల్ లో బెడ్ లు లేని పరిస్థితి నెలకొందని గుంటూరు నగరంలో ఎప్పుడు లేని విధంగా స్మశానాలు శవాలతో నిండిపోయాన్నారు. కరోనాపై ప్రజలలో పూర్తి అవగాహన కల్పించాలిసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఉందని మన రాష్ట్రం మినహా అన్ని రాష్ట్రాలలో విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల పరీక్షలను రద్దు చేసారని మన రాష్ట్రంలో పరీక్షలపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు.
 
ప్రజలందరూ భౌతిక దూరం, సానిటైజర్, మాస్క్ తప్పనిసరిగా వినియోగించేలా చర్యలు మరియు
హాస్పిటల్లో బెడ్ల సంఖ్యను, సిబ్బంది ని పెంచాలని ప్రభుత్వానికి సూచించారు.షేక్ బాజి గారు మాట్లాడుతూ, రెండో దఫా కోవిడ్ను నియంత్రించడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.

ఊహించని రీతిలో తీవ్రంగా ముంచుకు వస్తున్న ముప్పును అధికార యంత్రాంగం పసిగట్టలేకపోయింది. తక్షణ నివారణ, రక్షణాత్మక చర్యలు చేపట్టే విషయంలో చేతులెత్తేసింది. రోగులు రోజు రోజుకీ పెరుగుతున్న దృష్ట్యా 200 హాస్పిటల్స్ మాత్రమే అనుమతించింది ఇది గతం తోపోల్చితే 200 పైగా తక్కువ. మరోపక్క కోవిడ్ కు ఉపయోగించే అత్యవసర మందులు బ్లాక్లో అమ్ముతున్నా దానిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది, ఆక్సిజన్ అందక వాహనాల్లోనే ప్రాణాలు కోల్పోతున్న అభాగ్యుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

కోవిడ్ కట్టడికి సామాజిక దూరం పాటించడం ఒక్కటే సరైన మార్గం అని తెలిసినా ప్రభుత్వం మాత్రం రెండో దశ విషయంలో ప్రభుత్వం బాద్యతగా వ్యవహరించాలన్నారు. ఎవరికైనా ఫోన్ చేస్తే వచ్చే వాయిస్ హెచ్చరికలు తప్ప స్పందన కరువయ్యిందని ఎద్దేవా చేసారు.
 
శుభకార్యాలు, మరణాలు, వినోద ప్రదర్శన ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో జనాలు చేరుతున్నారు. అన్నిరకాల దుకాణాలు, వైన్ షాపుల్లో సామాజిక దూరం పాటించడం లేదు. హెూటళ్లు, రెస్టారెంట్లలో మాస్కులు తీసి ఎదురుగా కూర్చుని తింటున్నారు. బస్సుల్లో మాస్క్ ఉంటే చాలు మిగతా విషయాలు పట్టించుకోవడం లేదు. వ్యాధి నియంత్రణకు అవసరమైన మందులు, ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

పెరుగుతున్న కోవిడ్ మరణాలు సమాజంలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. మృతులకు అంతిమ సంస్కారం చేసే విషయంలో ప్రభుత్వం తగిన విధంగా స్పందించాలి. మృతదేహాల సంఖ్య గతంలో కంటే నాలుగురెట్లు పెరిగిపోవడంతో దహనం. చేయడం లేదా ఖననం చేయడం కూడా ఇబ్బందిగా మారింది. మరణించిన వారి దహన సంస్కారాలు చేయడానికి శ్మశానాల్లో సిబ్బంది కొరత దీనికి కారణం. అందువల్ల ఎక్కువ సిబ్బందిని నియమించి అంతిమ సంస్కారాలు వేగంగా జరిగేలా చూడాలి. కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని భాజపా డిమాండ్ చేసింది.
 
ఉమామహేశ్వర రాజు మాట్లాడుతూ కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఏదో రూపేణా అదుకోవాలని ప్రభుత్వం కు కోరారు. ప్రస్తుతం రెండో దశ ముగియకుండానే మూడోదశ ముంచుకొస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంగం డెయిరీ దోపిడీలో చంద్రబాబు వాటా ఎంత?: పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య