Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రైతుకు దుబాయ్‌లో లాటరీ తగిలింది.. కోటీశ్వరుడయ్యాడు.. ఎలా?

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (15:36 IST)
భార్యను బతిమాలి లాటరీ కొన్నాడు. అంతే కోటీశ్వరుడు అయ్యాడు. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన ఓ రైతు లాటరీతో కోటీశ్వరుడు కావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లికి చెందిన రిక్కల విలాస్.. కొన్నాళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ రెండేళ్ల పాటు డ్రైవర్‌గా పనిచేశాడు. 
 
అయితే ఆ తర్వాత మరో ఉద్యోగం కోసం వెతికాడు కానీ ఉద్యోగం దొరకలేదు. దీంతో చేసేది లేక భారత్‌కు వచ్చేశాడు. అయితే, యూఏఈలో ఉన్నప్పుడు లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది అతనికి. 
 
సొంతూరికి వచ్చిన తర్వాత కూడా లాటరీ టికెట్ల మీద మనసు చావలేదు. దీంతో భార్యను బతిమాలి ఆమె దగ్గర రూ.20వేలు తీసుకున్నాడు. ఆ డబ్బును దుబాయ్‌లో ఉన్న తన స్నేహితుడికి పంపించాడు. అలా లాటరీ టిక్కెట్లు కొనేలా చేశాడు.
 
అయితే ఆ లాటరీ ద్వారానే ఆ రైతు కోటీశ్వరుడు అయ్యాడు. ఆ లాటరీ టికెట్‌కే కోట్లు తగిలాయి. తన భార్య వల్లే ఈ లాటరీ వచ్చిందని విలాస్ చెప్పాడు. దుబాయ్‌లో కొన్న ఓ లాటరీ టికెట్‌కు సుమారు రూ.29 కోట్ల నగదు బహుమతి లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments