కారు దిగుతున్నావా దిగు.. నీ దుస్తులను చించేస్తా? ఉబెర్ డ్రైవర్

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (15:06 IST)
బెంగళూరులో ఓ టెక్కీకి ఉబెర్ డ్రైవర్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. రాత్రిపూట పని ముగించుకుని అవుటింగ్ వెళ్లి.. క్యాబ్‌లో ఎక్కి కూర్చున్న మహిళకు ఉబెర్ కారు డ్రైవర్‌తో ఇబ్బందులు తప్పలేదు.


వీకెండ్ కావడంతో శనివారం రాత్రి 11 గంటలకు ఉబెర్ క్యాబ్ బుక్ చేసింది ఓ యువతి. అలా బుక్ చేసిన కారెక్కి కూర్చున్న తనకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడిందనే విషయాన్ని సదరు యువతి తన ఫేస్‌బుక్ పేజీలో రాసింది. 
 
అర్థరాత్రి పూట స్నేహితులతో కలిసి అవుటింగ్ వెళ్లి రాకండి అంటూ ఆ యువతిని హెచ్చరించాడు. ఫోనులోనూ సదరు యువతి గురించి తప్పుగా మాట్లాడాడు. దీన్ని విన్న యువతి డ్రైవర్‌ను మందలించింది. 

కానీ ఆ డ్రైవర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. యువతిని నానా మాటలు అన్నాడు. తాను తాగి రాలేదని చెప్పినా యువతిని తూలనాడాడు. ఇక వేరే గతి లేకుండా ఎమెర్జెన్సీ బటన్ నొక్కింది. దాంతో డ్రైవర్‌కు ఫోన్ వచ్చింది. 
 
ఫోనులో మాట్లాడిన యువతి తనకు వేరొక క్యాబ్ పంపాల్సిందిగా కోరింది. దీంతో ఆ డ్రైవర్ నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను దించేశాడు. ''కారు దిగుతున్నావా దిగు.. నీ దుస్తులను చించేస్తా" అంటూ తీవ్రపదజాలంతో దూషించి యువతిని అక్కడే వదిలిపెట్టి వెళ్లాడు. అలా ఆ కారు దిగిన యువతికి మరో క్యాబ్ రాలేదు. చివరికి అర్థరాత్రి పూట స్నేహితుల సాయంతో ఆ యువతి ఇంటికి చేరుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనసూయకు గుడికడతాం... అనుమతి ఇవ్వండి... ప్లీజ్

'రణబాలి'గా విజయ్ దేవరకొండ.. ఏఐ వాడలేదంటున్న దర్శకుడు

చిత్రపరిశ్రమలో కమిట్మెంట్ అంటే అర్థం వేరు .. ఓ పెద్దాయన అలా ప్రవర్తించారు : గాయని చిన్మయి

కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్: చిరంజీవి గారు వేరే తరం నుండి వచ్చారు.. ఇప్పుడు పరిస్థితి వేరు.. చిన్మయి

Eesha Rebba: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ పెండ్లి విషయంపై తాజా అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments