Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూపాయికి ఇడ్లీ.. 80 ఏళ్ల బామ్మ రోజుకి వెయ్యి ఇడ్లీలు అమ్ముతుందట..!

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (11:09 IST)
రూపాయికి ఇడ్లీ ఇవ్వడం అనేది ప్రస్తుతం సాధ్యం కాని విషయం. కానీ తమిళనాడుకు చెందిన 80 ఏళ్ల బామ్మ ఒక్క ఇడ్లీని రూపాయికి అమ్ముతూ వార్తల్లోకెక్కింది. వివరాల్లోకి వెళితే, తమిళనాడు, కోవై, వడివేలంపాళయంకు చెందిన 80 ఏళ్ల బామ్మ ఒక ఇడ్లీని రూపాయికి అమ్ముతోంది. ఇంకా చట్నీ, సాంబార్ కూడా రూపాయి ఇడ్లీకి అమ్ముతోంది. 30 ఏళ్ల క్రితం కమలాథాయ్ అనే 80 ఏళ్ల బామ్మ ఇడ్లీలు అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించింది. 
 
ఈ వ్యాపారం గురించి ఆ బామ్మ మాట్లాడుతూ.. తనది వ్యవసాయ కుటుంబం అని.. 30 ఏళ్ల క్రితం ఈ వ్యాపారాన్ని ప్రారంభించానని చెప్పింది. ప్రతిరోజూ తన కుటుంబ సభ్యులు తనను ఇంట వదిలి పొలాలకు వెళ్లిపోయేవారని.. ఆ సమయంలో ఖాళీగా వుండలేక తన ఊరు ప్రజల కోసం చౌక ధరకే ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని ఇవ్వదలుచుకున్నానని చెప్పుకొచ్చింది. 
 
ఈ క్రమంలో ఇడ్లీ షాపు ప్రారంభించానని చెప్పింది. ఇందుకోసం ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకునే దాన్ని. అలాగే తాజా కూరగాయలను, పిండిని ఉపయోగిస్తానని.. రోజుకు వెయ్యి ఇడ్లీలు అమ్ముతానని వెల్లడించింది. 
 
తొలుత ఒక ఇడ్లీ 50 పైసలకు అమ్మానని.. ప్రస్తుతం ఆ ధర రూపాయికి పెరిగిందని తెలిపింది. పేద ప్రజలకు ఈ ధర గిట్టుబాటు కావడంతో ఇడ్లీలు అమ్ముడుపోతుంటాయని వెల్లడించింది. ఇంకా కూలీలు, కార్మికులకు కడుపునిండా అల్పాహారం పెట్టడం సంతోషంగా వుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments