ప్రియుడితో రీల్స్ : ప్రశ్నించిన భర్తను హత్య చేసిన భార్య

ఠాగూర్
శుక్రవారం, 21 నవంబరు 2025 (10:41 IST)
తమిళనాడు రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. తన భార్య ఆమె ప్రియుడితో కలిసి రీల్సే చేయడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అతనితో కలిసి రీల్స్ ఎందుకు చేశావంటూ భార్యను భర్త ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన భార్య.. భర్తను హత్య చేసింది. ఈ దారుమం తిరువణ్ణామలై జిల్లా సేతుపట్టు సమీపంలోని ఇడయాన్ కొళత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన విజయ్ (27) అనే వ్యక్తి ఓ లారీ డ్రైవర్. ఆయనకు ఐదేళ్ల క్రితం షర్మిల అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో విజయ్ విధులకు వెళితి 10 లేదా 15 రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో షర్మిలకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ విషయాన్ని పసిగట్టిన విజయ్.. ఇరుగుపొరుగువారివద్ద విచారించగా, తన భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్టు నిర్ధారించుకున్నాడు. 
 
ఈ క్రమలో షర్మిల తన ప్రేమికుడితో కలిసి రీల్స్ చేయడాన్ని గుర్తించిన విజయ్.. భార్యను నిలదీశాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో షర్మిల ఓ కర్రతో భర్త తలపై కొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత షర్మిల తన తల్లితో కలిసి మృతి చెందిన విజయ్‌ను కిటికీకి వేలాడది ఆత్మహత్య చేసుకున్నట్టుగా నమ్మించే ప్రయత్నం చేసింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, భార్య, అత్తను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. దీంతో వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments