Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ స్థానికేతరుడు.. తమిళనాడును తమిళుడే పాలించాలి : సీమాన్

Webdunia
గురువారం, 29 ఆగస్టు 2019 (09:32 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు స్థానికేతర సెగ తగిలింది. ఆయన ప్రారంభించనున్న రాజకీయ పార్టీని అడ్డుకుని తీరుతామని తమిళ దర్శకుడు, నామ్ తమిళర్ కట్చి అధ్యక్షుడు సీమాన్ ప్రకటించారు. పైగా, తమిళనాడు రాష్ట్రాన్ని కేవలం తమిళుడే పరిపాలించాలని ఆయన స్పష్టం చేశారు. 
 
కాంచీపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, రాష్ట్రంలోని డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీలను దూరం పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తాము ఓడిపోలేదనీ, ప్రజలే ఓడిపోయారన్నారు. తాను చదువుకోకపోయినా ఇతరుల చదువు కోసం శ్రమించిన కామరాజర్ వంటి నాయకులు ఇప్పుడు లేరని సీమాన్ అన్నారు.
 
ఇకపోతే, తమిళనాడును తమిళుడే పాలించాలని, రాష్ట్రేతరులు పాలించడాన్ని తాము అడ్డుకుంటామని నామ్‌ తమిళర్‌ కట్చి సమన్వయకర్త సీమాన్‌ హెచ్చరించారు. రజనీకాంత్ కనుక రాజకీయ పార్టీని ప్రకటిస్తే దానిని అడ్డుకుని తీరుతామని ఆయన ప్రకటించారు. 
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments