Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా లాక్‌డౌన్ : ఏడో రాష్ట్రంగా తమిళనాడు... 30 వరకు అన్నీ బందే

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (19:37 IST)
కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గుముఖంపట్టని రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ప్రస్తుతం దేశంలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలలో తమిళనాడు ఒకటి. ఆదివారం 106 కొత్త కేసులు నమోదు కాదు, సోమవారం ఈ సంఖ్య 98గా ఉంది. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 1173కు చేరుకుంది. ఇందులో 13 మంది చిన్నారులు కూడా ఉన్నట్టు తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి బీలా రాజేష్ వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14వ తేదీతో ముగియనున్న లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు తమిళనాడు ప్రభుత్వం పొడగించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ఆదేశాలు జారీచేశారు. దేశంలో కేంద్ర ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా లాక్‌డౌన్ పొడగించిన రాష్ట్రాల్లో తమిళనాడు ఏడో రాష్ట్రంగా నిలిచింది.  
 
అలాగే, తమిళనాడు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో కేవలం 50 మంది మాత్రమే కోలుకోగా 11 మంది మరణించారు. రాష్ట్ర రాజధాని చెన్నైలో సోమవారం సాయంత్రం వరకు మొత్తం 208 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కోయంబత్తూరులో 126, తిరుపూరులో 78, ఈరోడులో 64, దిండిగల్‌లో 56, తిరునెల్వేలిలో 56, నామక్కల్‌, చెంగల్పట్టు జిల్లాల్లో 45 చొప్పున నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments