Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుంచి రక్షిస్తున్న శానిటైజర్లు... అందుకే ఆ తండ్రి ఆ పేరు పెట్టాడు...

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (19:24 IST)
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ప్రపంచం యావత్తూ కరోనా నామస్మరణలో మునిగితేలుతోంది. ఈ వైరస్ పేరు చెబితేనే చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రాణభయంతో వణికిపోతున్నారు. అందుకే ఈ వైరస్ బారినుంచి ప్రజలను కాపాడేందుకు, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆయా దేశాలు లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నాయి. 
 
ముఖ్యంగా, భారత్ వంటి దేశాల్లో లాక్‌డౌన్‌ను పకడ్బంధీగా అమలు చేస్తున్నారు. ఈ సమయంలో పుట్టిన పిల్లలకు కూడా కరోనా, లాక్‌డౌన్లకు గుర్తుగా ఆ పేర్లను పెడుతున్నారు. ఇప్పటికే కరోనా కుమార్, కరోనా కుమారి, లాక్‌డౌన్, కోవిడ్ అంటూ పేర్లు పెట్టుకున్నారు.
 
తాజాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరాన్ పూర్ జిల్లాలో జన్మించిన బిడ్డకు ఓ తండ్రి విచిత్రమైన పేరు పెట్టారు. నిజానికి కరోనా వైరస్ బారినపడుకుండా ఉండేందుకు సామాజిక భౌతికదూరంతో పాటు.. చేతులకు శానిటైజర్లు పూసుకోవాలని పదేపదే కోరుతున్నారు. దీంతో ఆదివారం జన్మించిన బిడ్డకు ఆ తండ్రి శానిటైజర్ అనే పేరు పెట్టారు. 
 
ఇదే అంశంపై ఆ బిడ్డ తండ్రి ఓమ్ వీర్ మాట్లాడుతూ, కరోనా నుంచి కాపాడుకోవడంలో శానిటైజర్లు కీలకపాత్ర పోషిస్తున్నాయని, ప్రభుత్వాలు కూడా శానిటైజర్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయని తెలిపాడు. మన చేతులకున్న క్రిములను తొలగించడంలో ప్రధాన పాత్ర పోషించేది శానిటైజర్ అని, దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారని, అందుకే తమ బిడ్డకు 'శానిటైజర్' అని పేరు పెట్టామని చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments