బ్యూటీపార్లర్‌కి వెళ్లివస్తానని చెప్పి పత్తాలేకుండా పారిపోయిన వధువు

Webdunia
సోమవారం, 8 జులై 2019 (14:25 IST)
పెళ్ళి పీటలపై నుంచి ఓ వధువు పారిపోయింది. బ్యూటీపార్లర్‌కి వెళ్లివస్తానని చెప్పి కనిపించకుండాపోయింది. దీంతో ఆదివారం జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని విలుపురం జిల్లా ఎలియత్తూరు గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన శక్తివేల్‌ అనే వ్యక్తి కుమార్తె దుర్గాదేవి (20) ఓ కళాశాలలో తమిళ భాషా శాస్త్రం అభ్యసిస్తోంది. ఈమెకు అదే ప్రాంతానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. 
 
ఆదివారం ఉదయం ముహూర్తం కావడంతో వధూవరుల కుటుంబాలు రెండూ పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో వధువు మాత్రం ఈ నెల 2వ తేదీన బ్యూటీ‌పార్లర్‌కు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. 
 
ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తెలిసినవారు, బంధువు ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆదివారం జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. కుమార్తె అదృశ్యంపై పోలీసులకు యువతి తండ్రి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments