Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లయిన మరుసటిరోజే నవ వధువు అదృశ్యం.. భర్తను వీడి...

Advertiesment
పెళ్లయిన మరుసటిరోజే నవ వధువు అదృశ్యం.. భర్తను వీడి...
, శనివారం, 29 జూన్ 2019 (16:03 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. పెళ్లియిన మరుసటిరోజే నవ వధువు అదృశ్యమైంది. భర్తను వదిలి రాత్రికి రాత్రే వెళ్ళిపోయిన ఈ వధువు.. తనకు ఇష్టమైన లెస్బియన్ వద్ద పడక గదిలో ఉన్నట్టు స్థానికులు గుర్తించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపూర్‌కు చెందిన ఓ యువతికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తికిచ్చి ఈనెల 5వ తేదీన వివాహం జరిపారు. ఆ మరుసటి రోజే నవవధువు కనిపించకుండా పోయింది. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు... ఆ యువతి కోసం దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో ఆ వధువు హర్యానా రాష్ట్రంలోని మనేసర్‌లో ఉన్నట్టు గుర్తించారు. 
 
ఆ తర్వాత ఆమె వద్ద ఆరా తీయగా, తన లెస్బియన్ భాగస్వామితో కలిసి ఉండేందుకు తాను తన భర్తకు దూరమైనట్టు చెప్పింది. ఈ మాటలు విన్న కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. అదేసమయంలో నవ వధువుతో నాలుగేళ్లుగా సాన్నిహత్యం కొనసాగిస్తూ వచ్చిన యువతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేవంత్ రెడ్డి రాజీనామా? బీజేపీలో చేరుతారా?