Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టిక్ టాక్ ప్రేమ.. 16 ఏళ్లలోనే తండ్రి అయిన బాలుడు

Advertiesment
Boy 16years old
సోషల్ మీడియా యాప్‌ల్లో ఒకటైన టిక్ టాక్‌కు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యువకులు టిక్ టాక్‌ను ఎడా పెడా వాడేస్తున్నారు. ఇలా టిక్ టాక్ ద్వారా ప్రేమలో పడిన ఓ 16ఏళ్ల బాలుడు తండ్రి అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, తేనికి చెందిన 16 ఏళ్ల బాలుడు చెన్నైలో చదివేందుకు వచ్చాడు. ఇతని తండ్రి దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో టిక్ టాక్ అతిగా వాడిన ఈ బాలుడికి ఫాలోవర్స్ అధికమయ్యారు. దీంతో పాటు గత ఏడాది అక్టోబర్ నెలలో అదృశ్యమయ్యాడు. ఈ నేపథ్యంలో చెన్నైకి వచ్చిన ఆ బాలుడి తండ్రి మిస్సింగ్ కేసు నమోదు చేశాడు. పది నెలలు గడిచినా ఆ బాలుడి ఆచూకీ తెలియరాలేదు. చివరికి అతను వాడే ఫోన్ ఆధారంగా అతడిని పట్టుకున్నారు. అంతేగాకుండా షాకయ్యారు. 
 
ఆ బాలుడు ఓ నర్సులో ప్రేమలో పడి ఆమెతో సంసారం చేస్తున్నాడు. అంతేగాకుండా అతనికి 40 రోజుల క్రితమే బాబు పుట్టాడని తెలిసింది. దీంతో ఆ బాలుడితో సహజీవనం చేసి ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన నర్సుపై కిడ్నాప్ కేసు పెట్టారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు శిశువు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 16 ఏళ్ల బాలుడి తల్లిదండ్రులు ఐదు లక్షల రూపాయలను చెల్లించాలని ఆదేశించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబు ప్లాన్.. కమ్మ-కాపు బంధానికి బాసటగా తానా: టార్గెట్ జగన్మోహన్‌ ‘రెడ్డి’