Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిజోరంలో కొత్త వైరస్ కలకలం.. 4800 పందులు మృతి

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (11:01 IST)
ఈశాన్య భారతంలోని రాష్ట్రాల్లో ఒకటైన మిజోరంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. దీంతో వందలాది పందులు మృత్యువాతపడుతున్నాయి. ముఖ్యంగా, ఇక్కడి పందుల్లో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ (ఏఎస్‌ఎఫ్‌) ప్రబలడంతో గత కొద్ది రోజులుగా అవి భారీ సంఖ్యలో చనిపోతున్నాయి. గత రెండు నెలల వ్యవధిలో 4,800 పందులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. 
 
దీనివల్ల రాష్ట్ర రైతులకు దాదాపు రూ.19 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పశుసంవర్థక శాఖ అధికారులు ప్రకటించారు. మార్చి 21న లంగ్‌లై జిల్లా లంగ్‌సేన్‌ గ్రామంలో బయటపడిన ఈ వ్యాధి ప్రస్తుతం 9 జిల్లాలకు వ్యాపించింది. వీటి పరిధిలోని 91 గ్రామాలను స్వైన్‌ ఫీవర్‌ ప్రభావిత ప్రాంతాలుగా అధికారులు ప్రకటించారు. 
 
ఇందులో ఒక్క ఆయ్‌జోల్‌ జిల్లాలోనే 55 గ్రామాలున్నాయి. స్వైన్ ఫీవర్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం 32 వేల పందులున్నాయి. అయితే ఈ వ్యాధి ప్రబలని ప్రాంతాల్లోనూ 100కు పైగా పందులు చనిపోయాయి. మిజోరంలో ఇలాంటి వ్యాధి ప్రబలడం ఇదే తొలిసారి. అయితే పందులను పొరుగు రాష్ట్రాలు, దేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే ఇందుకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments