Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పందుల వధకు అస్సాం ప్రభుత్వం ఆదేశం... ఎందుకో తెలుసా?

Advertiesment
పందుల వధకు అస్సాం ప్రభుత్వం ఆదేశం... ఎందుకో తెలుసా?
, గురువారం, 24 సెప్టెంబరు 2020 (16:00 IST)
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ఇపుడు ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సాంను ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. ఈ ఫ్లూ కారణంగా ఇప్పటికే అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యగా వేల సంఖ్యలో పందులు మృత్యువాతపడుతున్నాయి. ఈ పరిస్థితి 14 జిల్లాల్లో బీభత్సంగా ఉంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఇది మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు చేపట్టింది. 
 
ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లోని 12 వేల వరాహాలను చంపేయాలని ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ ప్రభుత్వం బుధవారం అధికారులను ఆదేశించింది. అదేసమయంలో వాటి యజమానులకు పరిహారం అందించాలన్నారు.
 
ఈ మేరకు ఉన్నతాధికారులతో ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో సీఎం మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా, నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పందులను వధించాలని, దుర్గాపూజ (దసరా)కు ముందే ఈ పని పూర్తిచేయాలని ఆదేశించారు.
 
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. 14 జిల్లాల్లోని 30 ఎపిసెంటర్లలో కిలోమీటర్ పరిధిలో పందులను వధించనున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వెంటనే డ్రైవ్ ప్రారంభించనున్నట్టు చెప్పారు. పరిహారాన్ని వాటి యజమానుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైరస్‌ను గుర్తించేందుకు 1 లేదా 2 రోజులు లాక్డౌన్ అమలు చేద్దాం : మోడీ సలహా