ప్రతిభకు మార్కులే కొలమానం కాదు.. రిజర్వేషన్లూ ముఖ్యమే : సుప్రీంకోర్టు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (17:08 IST)
విద్యార్థుల ప్రతిభతకు కేవలం మార్కులు మాత్రమే ముఖ్యం కాదనీ రిజర్వేషన్లు కూడా ముఖ్యమేనని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ ప్రవేశాల్లో ఓబీసీ విద్యార్థుల రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అపెక్స్ కోర్టు ఈ తరహా వ్యాఖ్యలు చేసింది. 
 
వైద్య విద్య కోసం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న నీట్ ప్రవేశపరీక్ష అడ్మిషన్‌లో ఓబీసీ కోటా రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. 
 
ఈ మేరకు ఈ నెల 7వ తేదీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అంతేకాకుండా, 2021-22 అడ్మిషన్లలో రిజర్వేషన్లు యదాతథంగా అమలు చేయాలని తేల్చిచెప్పింది. 
 
ఒక విద్యార్థి సామాజిక ఆర్థిక నేపథ్యానికి సంబంధించి తప్పనిసరిగా సందర్భోచితంగా ఉండాలని వెనుకబాటుతనాన్ని పరిష్కరించడంలో రిజర్వేషన్ల పాత్రను తిరస్కరించలేమని కోర్టు అభిప్రాయపడింది. 
 
ఈ రిజర్వేషన్లు మెరిట్‌కు విరుద్ధంగా లేవని, కానీ, సామాజిక న్యాయం పంపిణీ పరిణామాలను ఇది మరింతగా పెంచుతుందని న్యాయమూర్తులు చంద్రచూడ్, బోపన్నలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందువల్ల 2021-22 బ్యాచ్ ప్రవేశాలకు సంబంధించి రిజర్వేషన్లపై ఎలాంటి స్టే ఇచ్చే ప్రసక్తే లేదని కోర్టు స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments