Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్కిన్ బానో అత్యాచారం కేసు : క్షమాభిక్షను రద్దు చేసిన సుప్రీంకోర్టు

ఠాగూర్
సోమవారం, 8 జనవరి 2024 (16:30 IST)
బిల్కిన్ బానో రేప్ కేసులో 11 మంది ముద్దాయిలకు గుజరాత్ కోర్టు ప్రసాదించిన క్షమాభిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ నిందితులందరూ రెండు వారాల్లో తిరిగి జైలుకు వెళ్ళాల్సిందేనంటూ సుప్రీకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం అధికారాలను గుజరాత్ సర్కారు లాగేసుకుంది కోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ నాగరత్న, ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. మొత్తం 11 మంది అత్యాచార నిందితుల రిలీజ్‌ను సవాల్ చేస్తూ బిల్కిన్ బానో వేసిన పిటిషన్‌కు అర్హత ఉందని సుప్రీంకోర్టు చెప్పింది.
 
రేప్ నిందితుల‌కు క్ష‌మాభిక్ష పెట్టే అర్హ‌త గుజ‌రాత్ ప్ర‌భుత్వానికి లేద‌ని, ఆ కేసులో అటువంటి ఆదేశాలు ఇచ్చే అధికారం మ‌హారాష్ట్ర స‌ర్కారుకు ఉంద‌ని, ఎందుకంటే అక్కడే ఆ కేసులో విచార‌ణ జ‌రిగింద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. 2002 గుజ‌రాత్ అల్ల‌ర్ల స‌మ‌యంలో బిల్కిస్ బానో రేప్‌కు గురైంది. ఆ స‌మ‌యంలోనే ఆమె కుటుంబాన్ని కూడా కోల్పోయింది. ఆ కేసులో శిక్షపడిన 11 మంది నిందితుల్ని 2022లో స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా రిలీజ్ చేశారు. 
 
క్ష‌మాభిక్ష ద్వారా రిలీజైన వారిలో జ‌వ్వంత్ నాయి, గోవింద్ నాయి, శైలేశ్ భ‌ట్‌, రాథేశ్యామ్ షా, బిపిన్ చంద్ర జోషి, కేశ‌రిభాయ్ వోహ‌నియా, ప్ర‌దీప్ మోర్దియా, బాకాభాయ్ వోహ‌నియా, రాజుభాయ్ సోని, మిటేశ్ భ‌ట్‌, ర‌మేశ్ చంద‌న ఉన్నారు. జైలులో 14 ఏళ్లు శిక్ష అనుభ‌వించిన త‌ర్వాత రిలీజైన‌ట్లు గుజరాత్ హోంశాఖ కార్య‌ద‌ర్శి రాజ్ కుమార్ గ‌తంలో తెలిపారు. రిలీజైన త‌ర్వాత ఆ 11 మందికి హీరోల త‌ర‌హాలో వెల్క‌మ్ ద‌క్కింది. అయితే రిలీజ్‌ను స‌వాల్ చేస్తూ బిల్కిస్ బానోతో పాటు మ‌రికొంత మంది సుప్రీంను ఆశ్ర‌యించారు.
 
సోమవారం విచార‌ణ స‌మ‌యంలో జ‌స్టిస్ నాగ‌ర‌త్న.. గుజ‌రాత్ ప్ర‌భుత్వం వైఖ‌రిని త‌ప్పుప‌ట్టారు. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ అధికారాల‌ను గుజ‌రాత్ అప‌హ‌రించిన‌ట్లు ఆమె తీర్పులో పేర్కొన్నారు. క్ష‌మాభిక్ష‌ను ఇవ్వ‌డం అంటే అధికారాల‌ను గుజ‌రాత్ స‌ర్కార్ కిడ్నాప్ చేసిన‌ట్లే అని తెలిపారు. మ‌హారాష్ట్ర అధికారాన్ని గుజ‌రాత్ లాగేసుకున్న‌ట్లు ఆమె త‌న తీర్పులో వివ‌రించారు. అయితే గుజ‌రాత్ స‌ర్కార్ త‌న ప‌రిధిలో ఉన్న అధికారాన్ని వాడుకున్న‌ట్లు కోర్టు తెలిపింది. గుజ‌రాత్ స‌ర్కార్ ఇచ్చిన క్ష‌మాభిక్షను ర‌ద్దు చేస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు ఈ తీర్పులో వెల్ల‌డించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

టికెట్ రేట్స్ పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మంచిదే: తెలంగాణ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి

బుర్ర కథా కళాకారిణి గరివిడి లక్ష్మి కథతో చిత్రం రూపొందబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments