Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ పరీక్షను వాయిదా వేసేది లేదు.. సుప్రీం కోర్టు స్పష్టం

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (14:14 IST)
నీట్ పరీక్షను వాయిదా వేయాలంటూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. నీట్ పరీక్ష వాయిదా పడదని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 12న నీట్ పరీక్ష జరిగి తీరుతుందని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది.
 
సీబీఎస్ఈ కంపార్ట్‌మెంట్, ప్రైవేట్ పరీక్షల ఫలితాలు వచ్చే వరకు నీట్ పరీక్షను వాయిదా వేయాలని, కొత్త డేట్‌ను ప్రకటించాలంటూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, సుప్రీంకోర్టు వారి వాదనలను తోసిపుచ్చింది. 
 
సెప్టెంబర్ 12న షెడ్యూల్ ప్రకారం నీట్ పరీక్ష 2021 జరుగుతుందని స్పష్టం చేసింది. ఇప్పటికే 16 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పుడు కొందరు విద్యార్థుల కోసం దాన్ని వాయిదా వేయలేమని తేల్చి చెప్పింది. 
 
'ఈ పిటిషన్‌ను మేం ఆమోదించలేం. అనిశ్చితి వద్దని మేం కోరుకుంటున్నాం. పరీక్షను కొనసాగిస్తున్నాం.' అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments